” మేడారం.. జనసంద్రం”

Feb 23,2024 15:10 #medaram jathara, #Telangana

మేడారం : మహా జాతరలో కీలక ఘట్టం ఆవిష్కఅతమైంది. యాత్రికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తమ ఇలవేల్పు సమ్మక్క గద్దెపై కొలువుదీరడంతో మేడారం మురిసిపోయింది. చిలకలగుట్ట మీద నుంచి కుంకుమ భరిణె రూపంలో అమ్మను ఆదివాసీ పూజారులు తీసుకొచ్చే ఘట్టం ఆద్యంతం ఉద్విగభరితంగా సాగింది. ఇప్పటికే సారలమ్మ సహా వనదేవతలంతా కొలువుదీరి ఉండడం, భక్తులు పెద్దమ్మగా కొలిచే సమ్మక్క కూడా గద్దెపైకి చేరడంతో జాతరకు నిండుదనం వచ్చింది.జంపన్నవాగులో చిన్నారులు సరదాగా గడుపుతున్నారు.

చింతల్‌ క్రాస్‌ వద్ద విడిది చేసిన యాత్రికులు సమీపంలోని జంపన్నవాగులో స్నానాలు చేస్తున్నారు. గురువారం ఇక్కడి చెక్‌డ్యామ్‌ వద్ద నీటిలో నలుగురు చిన్నారులు వణుకుతూ కాసేపు అలాగే కూర్చున్నారు. మేడారం జాతరలో మేకలు, గొర్రెలు కిలో రూ.800కు విక్రయిస్తుండగా మటన్‌ దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. మేడారంలో అమ్మవారు సమ్మక్క రాక ముందు నుంచే వడ్డెలు, పూజారులు వరిసాగు వద్ద పలు పూజలు నిర్వహించారు. పోతరాజు చిలుక గూడు నుండి తల్లిని నడిపిస్తాడనే నమ్మకంతో అతని చిత్రం గద్దెపై ప్రతిష్టించబడ్డారు. పోతరాజును అనుముగా భావించి సమ్మక్క పూజారులు, గ్రామ పెద్దలు, అభ్యుదయ యువజన సంఘం, ఆదివాసీ సంఘాలు గురువారం ఉదయం అనుముగుట్టకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు.

కంకవనంతో బయలుదేరి గ్రామ పొలిమేరలకు చేరుకోగానే మహిళలు నీళ్లతో స్వాగతం పలికారు. అక్కడే ఉన్న పోతరాజు గుడికి చేరుకున్నాడు. అంతకు ముందు ఆలయ ప్రాంగణాన్ని మహిళలు నీటితో శుద్ధి చేసి పసుపు, కుంకుమలతో అలంకరించారు. అడవి నుంచి తెచ్చిన కంకవనంతో పోతరాజు మందిరంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం డప్పువాయిద్యాలతో ఊరేగింపుగా వెళ్లి మేడారంలోని సమ్మక్క గద్దెపై ప్రతిష్ఠించారు. గద్దెలపై కంకవనాన్ని ప్రతిష్ఠించిన అనంతరం అర్చకులు, పెద్దలు, గిరిజన పెద్దలు చిలకలగుట్టకు బయలుదేరారు. అనంతరం చిలుకలగుట్టకు వెళ్లి ప్రధాన పూజారితో పాటు సమ్మక్కను కుంకుమ భరణి రూపంలో తీసుకుని మేడారం బయలుదేరారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క వనదేవతకు స్వాగతం పలికారు. ప్రభుత్వం తరపున, ప్రభుత్వం తరపున ఎస్పీ పి.శబరీష్‌ ఎకె 47 తుపాకీతో మూడు రౌండ్లు గాలిలోకి కాల్చి స్వాగతం పలికారు. చిలుకలగుట్ట నుంచి పోలీసుల ఎస్కార్ట్‌ సమ్మక్కను గద్దెపైకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మేడారం మొత్తం భక్తి పారవశ్యంలో మునిగిపోయింది.

➡️