యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే చంద్రబాబు రావాలి : మాజీ ఎమ్మెల్యే కొండబాబు

Feb 22,2024 16:30 #ex mla, #press meet

ప్రజాశక్తి -కాకినాడ :యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే చంద్రబాబు ప్రభుత్వం రావాలని యువత కోరుకుంటున్నారని కాకినాడ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. గురువారం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మై ఫస్ట్‌ ఓట్‌ ఫర్‌ సిబిఎన్‌ పోస్టర్‌ ఆవిష్కరణ చేపట్టారు.ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ మోసపూరిత మాయమాటలతో యువతను మోసం చేసి అధికారం చేపట్టిన జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో ఉద్యోగాలు భర్తీ చేయలేదన్నారు. రాష్ట్రానికి ఎటువంటి పరిశ్రమలు తీసుకురాకుండా, జే- టాక్స్‌ పేరుతో రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలను ఇతర రాష్ట్రాలకు తరలిపోయేలా చేసాడని విమర్శించారు. జగన్‌ అధికారం చేపట్టిన వెంటనే నిరుద్యోగులకు 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని హామీలు ఇచ్చి, ఫిష్‌ మార్కెట్లు, మటన్‌ షాపులో, బ్రాందీ షాపుల్లో ఉద్యోగాలంటూ యువత భవిష్యత్తును నాశనం చేశాడన్నారు. తెలుగుదేశం- జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సిటీ అధ్యక్షులు మల్లిపూడి వీరు, తెలుగు ప్రొఫెషనల్‌ వింగ్‌ కాకినాడ జిల్లా అధ్యక్షులు వనమాడి మోహన్‌ వర్మ, నాయకులు పలివెల రవి, తుమ్మల రమేష్‌, గదుల సాయిబాబా, గాది శివరామకృష్ణ, రహీమ్‌, మీసాల సునీత, పిర్ల లక్ష్మీ ప్రసన్న, సత్యవేణి, దుర్గా దర్శన్‌, గుజ్జు లక్ష్మణరావు, చింతలపూడి రవి, గెడ్డం పూర్ణ, పాలిక సూర్య, యాదవ శ్రీను, నిద్రబింగి సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు.

➡️