రాష్ట్రంలో జగన్‌ విధ్వంస పాలన కొనసాగిస్తున్నారు : ప్రత్తిపాటి

Mar 1,2024 15:45 #pattipati pullarao, #press meet

అమరావతి: అధికారం కోల్పోబోయే సమయంలోనూ సీఎం జగన్‌.. తన విధ్వంస పాలన కొనసాగిస్తున్నారని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. తన కుమారుడు శరత్‌ను 16 గంటల పాటు ఏవేవో ప్రాంతాల్లో తిప్పారని ఆరోపించారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేకే అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ ఎన్ని కుతంత్రాలు చేసినా బెదిరింపులకు భయపడేది లేదన్నారు. తనకు న్యాయం, ధర్మంపై విశ్వాసం ఉందని.. అరాచకాన్ని నమ్ముకున్న జగన్‌ను అవే తొక్కిపెడతాయన్నారు.

”ఏపీ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (ఏపీ డీఆర్‌ఐ)ఎవరి ఆధీనంలో ఉంది? ప్రతిపక్షాలపై కక్ష సాధింపు కోసమే ఈ దర్యాప్తు సంస్థ పనిచేస్తోందా? ఇప్పటివరకు వారు పెట్టిన కేసులన్నీ తెలుగుదేశం నేతలపైనే. టిడిపి-జనసేన సభలు విజయవంతం అవుతుండటంతో వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే అక్రమ కేసులు పెడుతున్నారు. వ్యవస్థలను విచ్ఛిన్నం చేసి.. వికఅత చేష్టలకు ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటున్నారు. జగన్‌ రెడ్డి చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు మా ఆత్మస్థైర్యాన్ని ఏమాత్రం దెబ్బతీయలేవు” అని ప్రత్తిపాటి అన్నారు.

➡️