రూ. 50 లక్షల వాహలా డబ్బు సీజ్‌

Mar 7,2024 15:02 #havala money, #seaze

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నగరంలో రూ. 50 లక్షల హవాలా డబ్బును సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు. డబ్బును తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రాత్రి 10 గంటలకు హవాలా డబ్బు తరలిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఎస్‌వోటీ పోలీసులు రంగంలోకి దిగారు. రాయదుర్గం పోలీసు స్టేషన్‌ పరిధిలో ఇన్నోవా క్రిస్టా వాహనంలో తరలిస్తున్న రూ. 50 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.

➡️