రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తా: ఎమ్మెల్యే రక్షణనిధి

Jan 19,2024 14:40 #mla rakshananidhi, #press meet

తిరువూరు: తనకు తిరువూరు సీటు ఇవ్వకపోవడంతో మనసు గాయపడిందని వైసిపి ఎమ్మెల్యే రక్షణనిధి అన్నారు. ఒక ఎంపీ చెప్పిన మాట విని రెండు సార్లు గెలిచిన తనకు సీటు లేకుండా చేశారని ఆక్షేపించారు. రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని.. ఎక్కడి నుంచి అనేది త్వరలో తెలియజేస్తానని చెప్పారు. గత పదేళ్ల రాజకీయ చరిత్రలో చంద్రబాబు, లోకేశ్‌, పవన్‌ కల్యాణ్‌లను తాను దూషించిన సందర్భాలు లేవన్నారు. టికెట్‌ ఇవ్వకపోవడానికి అది కూడా ఒక కారణం కావచ్చని భావిస్తున్నానన్నారు.

➡️