రేపటి నుంచి గుణదల మేరీ మాత ఉత్సవాలు

ఎన్టీఆర్‌: ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గుణదల మేరీ మాత ఉత్సవాలు రేపటి (శుక్రవారం) నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది శతాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు.శతాబ్ధి ఉత్సవాలకు సంబంధించి పోస్టర్‌ను వికర్‌ జనరల్‌ మోన్సిన్యోర్‌ మువ్వల ప్రసాద్‌ ఆవిష్కరించారు. గుణదల ఉత్సవాలకు లక్షలాదిగా యాత్రికులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో పుణ్యక్షేత్ర గురువులు ఇప్పటికే సకల ఏర్పాట్లు పూర్తి చేశారు.

➡️