రేపు ఎంజీబీఎస్‌ – ఫలక్‌నుమా మధ్య మెట్రోకి శంకుస్థాపన

హైదరాబాద్‌ : ఎంజీబీఎస్‌ – ఫలక్‌నుమా మధ్య మెట్రో మార్గానికి ఫారుక్‌నగర్‌ బస్‌డిపో వద్ద సీఎం రేవంత్‌ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. ఎంజీబీఎస్‌ – ఫలక్‌నుమా మధ్యలో 5.5 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం జరగనుంది.దారుల్‌షిఫా నుంచి ఆలియాబాద్‌ మీదుగా సాగే ఈ మార్గంలో సాలార్‌జంగ్‌ మ్యూజియం, చార్మినార్‌, శాలిబండ, ఫలక్‌నుమా వద్ద 4 మెట్రో స్టేషన్లు ఉంటాయి. పాతబస్తీ కారిడార్‌లో రోడ్ల విస్తరణ వల్ల మొత్తం 1,100 ఆస్తులు ప్రభావితమవుతాయని ఎన్వీఎస్‌ రెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం ఈ మార్గంలోని ప్రతి మెట్రో స్టేషన్‌ వద్ద 120 అడుగులు, మిగిలిన ప్రాంతాల్లో 100 అడుగుల విస్తీర్ణంతో రోడ్లు ఉండేలా డిజైన్‌ చేసినట్టు చెప్పారు. మెట్రోరైల్‌ రెండో దశలో నాగోల్‌-శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు మార్గంలో చాంద్రాయణగుట్ట వద్ద అనుసంధానిస్తామని వివరించారు. చాంద్రాయణగుట్ట వద్ద మేజర్‌ ఇంటర్‌చేంజ్‌ స్టేషన్‌ను నిర్మించాల్సి ఉంటుందని తెలిపారు.

➡️