రేపు టిడిపి-జనసేన తొలి జాబితా?

Feb 24,2024 08:29 #first list, #tdp -janasena

ప్రకటించనున్న ఇరు పార్టీల అధినేతలు!

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :టిడిపి – జనసేన అభ్యర్థుల తొలి జాబితా శనివారం విడుదల కానున్నట్లు తెలిసింది. ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్‌కల్యాణ్‌ ప్రకటించే అవకాశం ఉందని ఆయా పార్టీల నేతలు చెబుతున్నారు. లోకేష్‌తోపాటు చంద్రబాబు శుక్రవారం ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. పవన్‌కల్యాణ్‌ కూడా విజయవాడకు విడిగా చేరుకున్నారు. శనివారం ఉదయం 9 గంటల్లోపు అందుబాటులో ఉండాలని చంద్రబాబు ఆ పార్టీ ముఖ్యనేతలకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. ఈ సమావేశం అనంతరం చంద్రబాబు, పవన్‌ సమావేశమై ఇరు పార్టీల తొలి జాబితా ప్రకటిస్తారని నేతలు చెబుతున్నారు. తొలి జాబితా కింద 60 సీట్లు ప్రకటించవచ్చునని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంతోపాటు 28వ తేదీన తాడేపల్లిగూడెంలో నిర్వహించనున్న ఉమ్మడి సభ ఏర్పాట్లపై కూడా చర్చించే అవకాశం ఉంది.

➡️