రేేపు చింతమడకకు సీఎం కేసీఆర్‌.. ఏర్పాట్లను పరిశీలించిన సీపీ శ్వేత

Nov 29,2023 16:50 #cm kcr, #paryatana

సిద్దిపేట : అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామంలోని 13వ పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సీఎం కేసీఆర్‌ గురువారం రానున్నారు. ఈ మేరకు సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ శ్వేత బుధవారం గ్రామానికి చేరుకొని ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హెలిప్యాడ్‌, పోలింగ్‌ కేంద్రం వద్ద పోలీస్‌బందోబస్తుపై తగిన ఆదేశాలు ఇచ్చారు. ప్రతిసారి కేసీఆర్‌ స్వగ్రామంలో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కాగా, జిల్లాలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు పోలీస్‌ అధికారులు బందోబస్తు ఏర్పాట చేశారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిద్దిపేట కమీషనరేట్‌కు చెందిన అధికారులు, సిబ్బంది, స్థానిక సాయుధ బలగాలు, జిల్లా హోంగార్డులు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఏఎస్‌ఐలు, హెడ్‌ కానిస్టేబుల్‌లు, హోంగార్డ్‌లు, రైల్వే పోలీసులతో పాటు కేంద్ర బలగాలు సీఆర్‌పీఎఫ్‌, జార?ండ్‌ రాష్ట్రం ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌, అధికారులు, సిబ్బందితో మొత్తం 2,632 మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.జిల్లాలో నేడు జరిగే ఎన్నికలకు సంబంధించి 278 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను పోలీసులు గుర్తించారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి పోలింగ్‌ కేంద్రంలో వెబ్‌ కాస్టింగ్‌ చేసి. ప్రతి పోలింగ్‌ కేంద్రాన్ని జియో ట్యాగింగ్‌ చేశారు. అంతే కాకుండా జిల్లా వ్యాప్తంగా 10 డ్రోన్‌ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

➡️