లోటస్‌ పాండ్‌కు సీఎం జగన్‌.. తల్లి విజయమ్మతో భేటీ

Jan 4,2024 14:37 #ap cm jagan, #meet, #vijayamma

హైదరాబాద్‌ : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి లోటస్‌ పాండ్‌కు చేరుకున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత జగన్‌ లోటస్‌ పాండ్‌కు వచ్చారు. ప్రస్తుతం లోటస్‌ పాండ్‌లో తల్లి విజయమ్మ ఉన్నారు. ఈ సందర్భంగా తల్లి విజయమ్మతో జగన్‌ భేటీ అయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు తల్లితో జగన్‌ సమావేశమయ్యారు. అనంతరం అక్కడి నుంచి బేగంపెట విమానాశ్రయానికి సీఎం బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్‌లో పర్యటన ముగించుకుని తిరిగి ఏపీకి వెళ్లేందుకు జగన్‌ బేగంపేటకు బయలుదేరారు.

➡️