వాటర్‌ట్యాంక్‌ పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

Jan 30,2024 15:10 #bhadradri, #Suicide

భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వాటర్‌ట్యాంక్‌ పైనుంచి పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన బూర్గంపాడు మండలం సారపాకలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మఅతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అయితే మృతుడు మతిస్థిమితం లేని వ్యక్తిగా గుర్తించారు. విచారణలో పూర్తి వివరాలు వెల్లడవుతాయని ఎస్‌ఐ రాజ్‌కుమార్‌ తెలిపారు.

➡️