వార్షిక కౌలు చెల్లించాలిన సీఆర్డీఏ వద్ద రాజధాని రైతుల ఆందోళన

ప్రజాశక్తి-అమరావతి: వార్షిక కౌలును వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సీఆర్డీఏ కార్యాలయం ఎదుట రాజధాని ప్రాంత రైతులు సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా అసైన్డ్‌ రైతులు, భూమిలేని కూలీలను ఆదుకోవాలని నినాదాలు చేశారు. రాజధాని ప్రాంతంలో జంగిల్‌ క్లియరెన్స్‌ చేయించాలని కోరారు. ఈ క్రమంలో రైతులు సీఆర్డీఏ కార్యాలయం లోపలికి వెళ్లకుండా పోలీసులు గేట్లు వేశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ట మాట్లాడుతూ.. వినతిపత్రం ఇచ్చేందుకు వస్తే గేట్లు మూసివేయడం సమంజసం కాదని.. సీఆర్డీఏ అధికారులు బయటకు వచ్చి వినతిపత్రం స్వీకరించాలని డిమాండ్‌ చేశారు.

➡️