విచారణకు హాజరైన ఎన్‌ఆర్‌ఐ యశస్వి.. సీఐడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

Jan 24,2024 17:31 #cid enquiry, #guntur

గుంటూరు: గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టిడిపి ఎన్‌ఆర్‌ఐ కార్యకర్త బద్దులూరి యశస్వి (యష్‌) విచారణ దఅష్ట్యా తెలుగు యువత కార్యకర్తలు సీఐడీ కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్నారు. విచారణ పేరుతో యశస్విని వేధిస్తున్నారని ఆందోళనకు దిగారు. కనీసం భోజనం ఇచ్చేందుకూ అనుమతించడం లేదని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో.. అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆందోళనకారులను పోలీసులు హెచ్చరించారు.వైసిపి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్‌కు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టినందుకు యష్‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. వఅత్తి రీత్యా యష్‌ అమెరికాలో ఉన్నారు. గతేడాది డిసెంబర్‌ 23న తల్లి ఆరోగ్యం బాగాలేదని భారత్‌కు రావడంతో శంషాబాద్‌ విమానాశ్రయంలో సీఐడీ అధికారులు అరెస్టు చేసి గుంటూరుకు తరలించారు. నాలుగు గంటల తర్వాత 41ఏ నోటీసు ఇచ్చి విడిచిపెట్టారు. జనవరి 11న తిరుపతిలో సీఐడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. తాజాగా బుధవారం మరోసారి గుంటూరు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.

➡️