విద్యుత్‌ ఉద్యోగుల, కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి:యుఈఈయు

Jan 7,2024 12:13 #Electricity, #Employees

ప్రజాశక్తి-కడప అర్బన్‌ : విద్యుత్‌ ఉద్యోగుల, కాంట్రాక్ట్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ జిల్లా గౌరవ అధ్యక్షులు కామనూరు శ్రీనివాసులు రెడ్డి, స్ట్రగుల్డ్‌ కమిటీ రాష్ట్ర చైర్మన్‌ సుదర్శన్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. ఆదివారం సిఐటియు జిల్లా కార్యాలయంలో యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ జిల్లా గౌరవ అధ్యక్షులు కామనురు శ్రీనివాసులు రెడ్డి అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యుత్‌ సంస్థలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలైన కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సమాన పనికి సమాన వేతనం, చనిపోయిన కార్మికుల కుటుంబంలో కారుణ్య నియామకాలు కల్పించాలని పేర్కొన్నారు. మీటర్‌ రీడర్లకు, పీస్‌ రేట్‌ వర్కర్లకు పని భద్రత కల్పించాలని, కార్మికులందరికీ ఒకే రకమైన వేతనం చెల్లించాలని, వేతన సవరణ 2022, ఏప్రిల్‌ నుంచి చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఎనర్జీ అసిస్టెంట్లకు (జూనియర్‌ లైన్మెన్‌ గ్రేడ్‌ 2) విద్యుత్‌ ఉద్యోగుల వలే అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. ప్రతినెల ఒకటవ తేదీ విద్యుత్‌ ఉద్యోగులకు చెల్లించాలనీ, 2022, వేతన సవరణ ప్రయోజనాలు కల్పించాలని పేర్కొన్నారు. రెగ్యులర్‌ ఉద్యోగులకు వేతన సవరణ బకాయిలు ఏకకాలంలో చెల్లించాలని, పెండింగ్లో ఉన్న రెండు వెంటనే చెల్లించాలని, ప్రతి నెల ఒకటవ తేదీ వేతనాలు చెల్లించాలని తెలిపారు. ఖాళీగా ఉన్న పోస్టులను పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులతో భర్తీ చేయాలని తెలిపారు. జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్టులు, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టులు, పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రమోషన్‌ ఇచ్చి భర్తీ చేయాలని పేర్కొన్నారు. జెన్కోలో జూనియర్‌ ప్లాంట్‌ అటెండెంట్‌ లకు, ప్లాంట్‌ అటెండెంట్లకు ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పారు. 22, 20, 22 వేతన సవరణ ద్వారా ఏర్పడిన వేతన వ్యత్యాసాలు సవరించాలని తెలిపారు. అపరిమిత వైద్య సదుపాయం కల్పించాలని, ఈపీఎఫ్‌ టు జిపిఎఫ్‌ సౌకర్యం పునరుద్ధరించాలని పేర్కొన్నారు. న్యాయమైన డిమాండ్స్‌ పరిష్కరించకపోతే 15 రోజుల తర్వాత ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. దీనికి సంబంధించి ఉత్తరాలను సీఎం, సిఎండి కి పంపుతున్నట్టు తెలిపారు. సమావేశంలో డిస్కం అధ్యక్షులు ఎన్‌. శివశంకర్‌, జిల్లా నాయకులు కె.వి సురేంద్రబాబు, ఎం. బి. శివ ప్రసాద్‌ రెడ్డి, నందీశ్వర్‌ రెడ్డి, కేశవ, నూర్భాష పాల్గొన్నారు.

➡️