వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చూడాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు

వనపర్తి : సీఎం రేవంత్‌ రెడ్డి సారథ్యంలో కొలువుదీరిన కాంగ్రెస్‌ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తున్నారని ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం వనపర్తి జిల్లా సమీ కృత కలెక్టరేట్‌ సముదాయంలో జిల్లా అధికార యంత్రాంగంతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను పరిష్కారించే విధానంలో స్పష్టమైన మార్పు కనబడాలన్నారు.సమస్యలు పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మనం ప్రజా సేవకులం మాత్రమే అని గుర్తించాలన్నారు. సమస్యలు విన్నవించుకోవడానికి వచ్చిన ప్రజలతో మర్యాదగా మసలుకోవాలని హితవు పలికారు. అంతిమంగా ప్రజల చేత శభాష్‌ అనిపించుకునేలా అధికారులు పని తీరు ఉండాలని చెప్పారు. వేసవి కాలంలో తాగునీటి ఇబ్బందులు లేకుండా ఇప్పటినుంచే ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు.

➡️