వైజాగ్‌లో మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ స్కాం కలకలం.. ఇద్దరు అరెస్ట్‌

Jan 15,2024 07:45 #scam, #visakhapatnam

విశాఖపట్నం : వైజాగ్‌లో మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ స్కాం కలకలం రేపుతోంది. వైజాగ్‌లో నమోదైన మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ స్కాంపై ఈడీ విచారణ చేపట్టింది. వైజాగ్‌ స్కాంకు సంబంధించి ఇద్దరిని ఈడీ అదుపులోకి తీసుకుంది. అమిత్‌ అగర్వాల్‌, నితిన్‌ తిబ్రూయల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అదుపులోకి తీసుకుంది. టెక్‌ ప్రో ఐటీ సొల్యూషన్‌ పేరుతో నితిన్‌, అమిత్‌లు కంపెనీ ఏర్పాటు చేశారు.మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ ద్వారా వచ్చిన నిధులను నితిన్‌, అమిత్‌ మళ్లించినట్లు ఈడీ వెల్లడించింది. బెట్టింగ్‌ యాప్‌లో వచ్చిన నిధులతో నితిన్‌, అమిత్‌ ఆస్తులను కొనుగోలు చేసినట్లు తెలిసింది. నితిన్‌, అమిత్‌ భార్యల పేరు మీద పెద్ద ఎత్తున ఆస్తుల కొనుగోలు చేసినట్లు ఈడీ వెల్లడించింది. ఇప్పటికే చత్తీస్‌గఢ్‌లో అయిన కేసులో అక్కడి ముఖ్యమంత్రికి ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈడీ దాడుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ను కేంద్రం నిషేధించిన విషయం విదితమే.

➡️