శ్రీశైలంలో రేపటి నుంచి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

Jan 11,2024 16:10 #brahmosthavalu, #srisailam

అమరావతి : నంద్యాల జిల్లా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో రేపటి నుంచి సంక్రాంతి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఈవో పెద్దిరాజు వెల్లడించారు. ఈనెల 12 నుంచి 18 వరకు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. శుక్రవారం సాయంత్రం ధ్వజారోహణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఉత్సవాల్లో రాత్రివేళ స్వామి, అమ్మవార్లకు వాహన సేవలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.ఉత్సవాల సందర్భంగా ఆర్జిత హోమాలు నిలుపుదల చేసినట్లు పేర్కొన్నారు. కాగా గత డిసెంబర్‌ 13వ తేదీ నుంచి జనవరి 9వ తేదీ వరకు యాత్రికులు హుండీలో వేసిన నగదును బుధవారం లెక్కించారు. మొత్తం 28 రోజుల్లో రూ.4,38,53,238 కోట్ల ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. నగదుతో పాటు 133 గ్రాముల 300 మిల్లీ గ్రాముల బంగారం, 11 కేజీల 850 గ్రాముల వెండి వచ్చిందని పేర్కొన్నారు.

➡️