శ్రీశైలానికి వెళ్లిన నారా లోకేష్‌

Feb 1,2024 12:28 #Nara Lokesh, #srisailam

ప్రజాశక్తి-శ్రీశైలం : టీడీపీ యువనేత నారా లోకేష్‌ శ్రీశైలం చేరుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన శ్రీశైలంకు వచ్చారు. కర్నూలు జిల్లా సున్నిపెంట హెలిప్యాడ్‌కు చేరుకున్న ఆయనకు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, టీడీపీ నేతలు ఎన్‌ఎండీ ఫరూక్‌, రాజశేఖర్‌ రెడ్డి, పలువురు టీడీపీ, జనసేన నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం సున్నిపెంట నుంచి ఆయన శ్రీశైలంకు రోడ్డు మార్గంలో బయల్దేరారు. కాసేపట్లో ఆయన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకోనున్నారు.

➡️