సంక్షేమ సామ్రాట్‌కి పలువురు జన్మదిన శుభాకాంక్షలు

అమరావతి: సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో 3 దశాబ్దాలపాటు సీఎంగానే ఉండాలని పలువురు ప్రజాప్రతినిధులు ఆకాంక్షించారు. రాష్ట్రవాప్తంగా సీఎం పుట్టిన రోజు వేడుకలు గురువారం ఘనంగా జరుగుతున్నాయి.సీఎం జగన్‌ జన్మదినం సందర్భంగా వైఎస్సార్‌సీపీ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ”గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్‌మోహన్‌ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని, మరెన్నో సంతోషకరమైన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని మనసారా కోరుకుంటున్నా” అంటూ ట్వీట్‌ చేశారు. సంక్షేమ సామ్రాట్‌ మా జగనన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ మంత్రి ఆర్కే రోజా ట్వీట్‌ చేశారు.

➡️