సనత్‌నగర్‌లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్‌

Mar 17,2024 14:45 #arrested, #ganjai

హైదరాబాద్‌ : గంజాయి రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా సనత్‌నగర్‌లో ఎస్‌వోటీ పోలీసులు గంజాయి కేసులో ఇద్దరు పాత నేరస్తులను అరెస్ట చేశారు. వారి వద్ద నుంచి 5.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బల్కంపేట్‌లో పవన్‌ ఇంటి వద్ద గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిషా నుంచి గంజాయి తెచ్చి కూలీలు, విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️