సీఎంను కటిసిన గ్రేటర్‌ మేయర్‌..

హైదరాబాద్‌: తెలంగాణలో సీఎం రేవంత్‌ రెడ్డిని ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ నేతలు కలవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు, బీఆర్‌ఎస్‌ నేతలు కొందరు సీఎం తో సమావేశం అవ్వగా, మరికొందరు త్వరలో బేటీ అవుతామని ముందే ప్రకటించారు. తాజాగా ఆ లిస్టులోకి గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌, కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి కూడా చేరారు. శనివారం మేయర్‌ విజయలక్ష్మి, సీఎం రేవంత్‌ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్దికి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. అనంతరం సీఎంతో సమావేశమైన ఆమె పలు అంశాలపై చర్చించినట్లు తెలిసింది.

➡️