సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన ఏపీ కాంగ్రెస్‌ నేత రఘువీరా రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ఆంధ్రప్రదేశ్‌ మాజీ పీసీసీ అధ్యక్షుడు, సీడబ్ల్యుసీ సభ్యుడు రఘువీరా రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో కలిశారు. రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఏపీకి చెందిన పలువురు కాంగ్రెస్‌ నాయకులు ఆయనను వరుసగా కలుస్తున్నారు. అంతకుముందు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కలిశారు. ఆమె తన తనయుడి పెళ్లికి తెలంగాణ ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. ఇటీవల జరిగిన పెళ్లికి ఆయన హాజరయ్యారు. తాజాగా రఘువీరా రెడ్డి తెలంగాణ సీఎంను కలిశారు. రఘువీరా రెడ్డి ఏపీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా పని చేశారు. వైఎస్‌ రాజశేఖర రెడ్డి కేబినెట్లో మంత్రిగా పని చేశారు.

➡️