స్టీల్‌ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం

విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో శనివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్టీల్‌ ప్లాంట్‌లోని బ్లాస్ట్‌ ఫర్నేస్‌ -3లో మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ప్లాంటుకు చేరుకుని మంటలార్పుతున్నారు. అగ్నిప్రమాదం కారణంగా ప్లాంటులో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. గతంలోనూ స్టీల్‌ ప్లాంట్‌లో జరిగిన పలు అగ్ని ప్రమాదాల్లో ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించాయి.

➡️