రైతు నుంచి రూ.10 లక్షలు లంచం

Feb 14,2024 08:07 #ACB Raids, #arrested, #mro

– ఎసిబి వలలో శామీర్‌పేట తహశీల్దార్‌

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో:ధరణి పోర్టల్‌లో భూమిని ఎక్కించేందుకు రైతు నుంచి రూ.పది లక్షలు లంచం తీసుకుంటూ శామీర్‌పేట తహశీల్దార్‌ ఎసిబికి చిక్కాడు. ఎసిబి డిఎస్‌పి మజీద్‌ అలీఖాన్‌, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. లల్గాడి మలకపేట గ్రామ రెవెన్యూ పరిధిలో 29 ఎకరాల భూమిని 2006లో మువ్వ రామశేషగిరి రావు అనే రైతు కొనుగోలు చేశారు. ధరణిలో భూమి నమోదు కోసం రెండేళ్ల కిందట మల్కాజ్‌గిరి జిల్లా శామీర్‌పేట మండలం తహశీల్దార్‌ సత్యనారాయణను సంప్రదించాడు. అందుకు తహశీల్దార్‌ రూ.30 లక్షలు లంచం డిమాండ్‌ చేశాడు. ఏడాది కిందట రూ.10 లక్షలు, 2023 డిసెంబర్‌ 28న రూ.20 లక్షల చెక్కును రైతు ఇచ్చారు. మరో రూ.పది లక్షలు తన డ్రైవర్‌కు ఇవ్వాలని తహశీల్దార్‌ డిమాండ్‌ చేశాడు. దీంతో విసిగిపోయిన బాధితుడు ఎసిబిని ఆశ్రయించారు. లంచం తీసుకుంటుండగా డ్రైవర్‌ను, తహశీల్దార్‌ను అదుపులోకి తీసుకున్నారు.

➡️