10 రైళ్లు రద్దు .. మరో 15 సర్వీసులు రీ షెడ్యూల్‌

అమరావతి: రైల్వే శాఖ ప్రయాణీకులకు చుక్కలు చూపిస్తోంది .. విజయవాడ – విశాఖపట్నం మార్గంలో 10 రైళ్లను రద్దు చేయడంతో పాటు.. మరో 15 సర్వీసులు రీ షెడ్యుల్‌ చేసింది. పగటి పూట వెళ్లే రైళ్లు రద్దుతో రైల్వే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు, రిజర్వేషన్‌ టికెట్లు అర్థంతరంగా రద్దు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. రద్దైన రైళ్ల జాబితాలో సింహాద్రి, రత్నాచల్‌, ఉదయ  ఎక్స్‌ ప్రెస్‌, రాయగడ ట్రైన్‌ ఉన్నాయి.. విశాఖ – విజయవాడ మధ్య రోజూ వేలాది మందితో రాకపోకలు సాగించే రైళ్ల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో.. రైల్వే శాఖపై మండిపడుతున్నారు.మరోవైపు.. ప్రయాణీకుల నుంచి వచ్చిన వ్యతిరేకతతో విశాఖ – లింగంపల్లి జన్మభూమి ఎక్స్‌ ప్రెస్‌ ను అధికారులు పునరుద్ధరించారు . విజయవాడ – ఖాజీపేట మీదుగా వెళ్ళాల్సిన ఏపీ ఎక్స్‌ ప్రెస్‌ దారి మళ్లించారు.. ఇక, ఆగస్టు 10వరకు రద్దైన రైళ్లను పరిశీలిస్తే.. రాజమండ్రి- విశాఖ ప్యాసింజర్‌, విశాఖ- మచిలీపట్నం ఎక్స్‌ ప్రెస్‌, విశాఖ – తిరుపతి డబుల్‌ డెక్కర్‌ సహా మరికొన్ని ఉన్నాయి.. కడియం – నిడదవోలు, ఖాజీపేట – బ ల్లార్షా సెక్షన్ల మధ్య జరుగుతున్న రైల్వే సేప్టీ వర్క్స్‌ కారణంగా సర్వీసులు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించిన విషయం విదితమే..

➡️