100 రోజుల్లో అభయహస్తం అమలు చేస్తాం : మంత్రి పొంగులేటి

Jan 8,2024 18:00 #hyderabad, #Telangana

హైదరాబాద్‌ : రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 6తో గడువు ముగిసిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా కోటి 5లక్షల మంది ఆయా పథకాలకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రజాపాలనపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష ముగిసిన అనంతరం పొంగులేటి మీడియాతో మాట్లాడారు. ప్రజాపాలనకు గడువు తర్వాత కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రజాపాలన దరఖాస్తు చేసుకోని వాళ్లు ఉంటే వారు ఎమ్మార్వో ఆఫీసులో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అభయహస్తం హామీలకు రాష్ట్ర వ్యాప్తంగా 1.05 కోట్ల దరఖాస్తులు వచ్చాయన్నారు. 40 రోజుల్లో నెరవేరుస్తామని తాము చెప్పలేదని.. వందరోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఎన్నికల సమయంలో చెప్పామని క్లారిటీ ఇచ్చారు. నిజమైన లబ్ధిదారులకు అభయహస్తం పథకాలు అందజేస్తామన్నారు.

➡️