1.5 కేజీల గంజాయి స్వాధీనం

Jun 15,2024 23:50 #1.5 kg of ganja, #seized

ఇద్దరు నిందితులు అరెస్టు
ప్రజాశక్తి- తెనాలిరూరల్‌ (గుంటూరు జిల్లా) :గుంటూరు జిల్లా తెనాలిలో గంజాయి విక్రయిస్తున్న, కొనుగోలు చేస్తున్న ఇద్దరు నిందితులను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను తెనాలి డిఎస్‌పి ఎం.రమేష్‌ మీడియాకు వెల్లడించారు. ఆయన వివరాల మేరకు..తెనాలి ఆర్‌టిసి బస్టాండ్‌ ప్రధాన గేటు ఆవరణంలో గంజాయి విక్రయిస్తున్న పఠాన్‌ సస్కర్‌ (32), గంజాయి కొనుగోలు చేస్తున్న ప్యాడిసన్‌ పేటకు చెందిన పురుషోత్తం నాని (30)లను అరెస్టు చేశారు. పట్టణానికి చెందిన మగ్గం వ్యాపారి జుపాలి వద్ద మగ్గం పనులు చేస్తున్న మొహమ్మద్‌ షఫీ వద్ద పఠాన్‌ సస్కర్‌ గంజాయి కొనుగోలు చేసిన చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి స్టేషన్‌ రోడ్డు, బస్టాండ్‌ ఆవరణంలో విద్యార్థులకు విక్రయిస్తున్నాడన్న పక్కా సమాచారంతో అరెస్టు చేశామని డిఎస్‌పి తెలిపారు. 1.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

➡️