ముఖ్యమంత్రి జగన్‌పై 26 కేసులు

ప్రజాశక్తి- కడప ప్రతినిధి : వైసిపి అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిపై 26 కేసులు ఉన్నాయి. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ వైసిపి అభ్యర్థిగా జగన్‌ తరఫున బాబారు వైఎస్‌.మనోహర్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అఫిడవిట్‌లో పొందుపర్చిన వివరాల మేరకు జగన్‌పై పది మనీలాండరింగ్‌ కేసులు ఉన్నాయి. అఫిడవిట్‌ సమయానికి ఎటువంటి ఛార్జెస్‌ ఫ్రేమ్‌ కాలేదని పేర్కొన్నారు. సిబిఐ, ఎసిబి, హైదరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌, ఆర్‌సి నెంబర్‌ (ఎ) ఆఫ్‌ 2011 నమోదు చేసినట్లు తెలిపారు. ఇదే సీరీస్‌లో 11 సిబిఐ, ఎసిబి కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. నంద్యాల త్రీటౌన్‌ పోలీస్‌స్టే షన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నెంబర్‌ 192,2017, ఎఫ్‌ఐఆర్‌ 177,2017 కింద రెండు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐ ఆర్‌ నెంబర్‌ 59, 2016 కింద కేసు, గుంటూరు జిల్లా పొన్నూరు పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నెంబర్‌ 45, 2016, హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నెంబర్‌ 861, 2013 కింద కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు.
జగన్‌ ఆస్తులు రూ.483 కోట్లు
వైఎస్‌ జగన్‌ చేతిలోని చర ఆస్తుల విలువ రూ.483,08,35,064 కోట్లు, ఆయన సతీమణి భారతి పేరు మీద రూ.119,38,07,193 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. వీటితోపాటు జగన్‌ స్థిర ఆస్తులు రూ.9,98,57,036 కోట్లు, భారతి పేరు మీద రూ.2,07, 90,821 కోట్లుగా చూపించారు. ప్రస్తుతం జగన్‌ చేతిలో రూ. ఏడువేలు, భారతి చేతిలో రూ.10,200 నగదు ఉన్నట్లు పేర్కొన్నారు. బ్యాంకు డిపాజిట్స్‌, ఎఫ్‌డిఆర్‌ టర్మ్‌ సహా అన్ని రకాల డిపాజిట్స్‌, సేవింగ్స్‌ ఇతర పెట్టుబడులను లెక్కిస్తే రూ. 263,64,92, 685 కోట్లు ఉన్నట్లుగా చూపించారు. భారతికి రూ.6,427.79 గ్రామ్స్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ విలువ రూ. 5,29,87,319 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. వీటితోపాటు మార్కెట్‌ విలువ ప్రకారం రూ.1,54,12,800 విలువ కలిగిన వ్యవ సాయ భూములు ఉన్నాయి. వీటికి అదనంగా రూ.11,03,13,280 కోట్లు విలువ కలిగిన వ్యవసాయేతర ఆస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. రెసిడెన్సియల్‌ ఆస్తులు రూ.13,29,46,700 కో ట్లు వెరసి మొత్తం రూ.46,78,89, 930 కోట్లుగా చూపించారు.

➡️