రెంటచింతల మండలంలో 34 మంది అరెస్టు

ప్రజాశక్తి – రెంటచింతల (పల్నాడు) : పోలింగ్‌ రోజు పల్నాడు జిల్లా రెంటచింతల మండల రెంటాల, తుమ్మరకోట, పాల్వాయి గేటు, జెట్టిపాలెం, గోలి తదితర గ్రామాల్లో జరిగిన అల్లర్లకు సంబంధించి ఇప్పటివరకు 34 మందిని అరెస్టు చేశామని, మరో 36 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టామని, వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని అడిషనల్‌ ఎస్‌పి (అడ్మిన్‌) జివి రమణమూర్తి తెలిపారు. పోలింగ్‌ రోజున జరిగిన సంఘటనలు సిసి కెమెరాలు నిక్షిప్తమయ్యాయని, రెంటాలలో కార్టన్‌ సెర్చ్‌ నిర్వహించగా ముళ్ళ పొదల్లో కర్రలు లభ్యమైనట్లు చెప్పారు. సరైన పత్రాలు లేని ఐదు వాహనాలు, మోటార్‌ సైకిల్‌, ఒక ఆటోను సీజ్‌ చేశామన్నార. కార్టన్‌ సెర్చ్‌ ప్రతిరోజు ఉంటుందన్నారు. రెండు లేదా మూడు కేసుల్లో నిందితులుగా ఉంటే రౌడీ షీట్‌ ఓపెన్‌ చేయనున్నట్లు ప్రకటించారు. సమావేశంలో గురజాల డిఎస్‌పి పి.వెంకటేశ్వరరావు ఎస్‌ఐ ఎం. ఆంజ నేయులు పాల్గొన్నారు.

➡️