దోమలచక్రం నిప్పు దుప్పటికి అంటుకొని యాచకుడు సజీవదహనం

ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు) : దోమల చక్రం నిప్పు దుప్పటికి అంటుకొని యాచకుడు సజీవదహనమైన విషాద ఘటన ఆదివారం అర్థరాత్రి గుంటూరులో జరిగింది. గుంటూరు జిల్లా తెనాలి పురపాలక సంఘ కార్యాలయం వెనక ఓ నిర్మాణంలో ఉన్న భవనం ఆవరణలో రవి అనే వ్యక్తి యాచిస్తూ జీవనాన్ని గడుపుతున్నాడు. ఆదివారం అర్ధరాత్రి పోలీసుల గస్తీ చేస్తుండగా, పొగలు రావడం గమనించి ఓ కానిస్టేబుల్‌ మంటలను ఆర్పి వేశారు. అయితే అప్పటికే రవి మఅతి చెందాడు. నిద్రించే సమయంలో దోమల చక్రాన్ని వెలిగించడంతో, అది అతని పడక దుప్పట్లకు అంటుకుని మంటలు వ్యాపించి సజీవదహనమైనట్లు అభిప్రాయపడ్డారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️