రమణ దీక్షితులుపై కేసు నమోదు

Feb 25,2024 08:31 #police case, #ttd

ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో :తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై కేసు నమోదైంది. టిటిడి సైబర్‌ సెక్యూరిటీ, సోషల్‌ మీడియా మానటరింగ్‌ సెల్‌ ఉద్యోగి ఎల్‌.మురళి సందీప్‌ ఫిర్యాదు మేరకు ఐపిసి 153 (ఎ), 295, 295-ఎ, 505 (2), ఆర్‌/డబ్ల్యు 120 (బి) సెక్షన్ల కింద క్రైమ్‌ నెంబర్‌ 03/2024తో తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. ఒన్‌టౌన్‌ ఎస్‌ఐ పిఆర్‌.లక్ష్మి రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. తిరుమల ఆలయంలో అక్రమాలు, శ్రీవారికి జరగాల్సిన కైంకర్యాలలో లోపాలు జరుగుతున్నాయంటూ, టిటిడి ఇఒ ఎవి.ధర్మారెడ్డి క్రిస్టియన్‌ అంటూ రమణ దీక్షితులు చెప్పినట్లు ఓ వీడియో నెట్టింట వైరల్‌ అయింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు కావడంతో ఆయన స్పందించారు. తాను అలా మాట్లాడలేదని, అటువంటి స్వభావం తనది కాదని చెప్పారు. తరతరాలుగా స్వామి వారి కైంకర్యాలు చేస్తున్నట్లుగానే ఇప్పుడూ చేస్తూ వస్తున్నామన్నారు.

➡️