ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన టిప్పర్.. డ్రైవర్ మృతి

Apr 4,2024 18:50 #Nellor, #road acident

ప్రజాశక్తి -నెల్లూరు : కొడవలూరు మండలం, బొడ్డువారిపాళెం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కావలి డిపోకు చెందిన నాన్ స్టాప్ బస్సు నెల్లూరు నుంచి తిరుగు ప్రయాణమై కావలికి వెళుతుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.గురువారం జరిగిన ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ వి . భాస్కర్ (52) తీవ్రంగా గాయపడ్డాడు. మరో ప్రయాణికుడి కి స్వల్ప గాయాలు పాలయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ డ్రైవర్ని వైద్య చికిత్స నిమిత్తం హైవే మొబైల్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించింది. మార్గమధ్యంలో డ్రైవర్ మృతి చెందారు. ఆర్టీసీ బస్సును వెనుక వైపు నుంచి అతివేగంగా టిప్పర్ ఢీకొన్నది. దీంతో బస్సు నుజునుజైనది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

➡️