మలేషియన్‌ ఎయిర్‌వేస్‌ విమానానికి తప్పిన ప్రమాదం..

Jun 20,2024 08:56 #flight, #missed

హైదరాబాద్‌: హైదరాబాద్‌ నుంచి కౌలాలంపూర్‌ వెళ్తున్న విమానానికి పెను ప్రమాదం తప్పింది. టేక్‌ ఆఫ్‌ అయినా 15 నిమిషాలకే కుడివైపు ఇంజిన్‌ లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయందోళనకు గురయ్యారు. పైలట్‌ మంటలను గుర్తించడంతో ప్రయాణికులు సేఫ్‌ గా బయట పడ్డారు. ఎవరికి ఎటువంటి హాని జరగకపోవడంతో అధికారులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
వివరాల్లోకి వెళితే ..గురువారం ఉదయం హైదరాబాద్‌ నుంచి కౌలాలంపూర్‌ మలేషియా ఎయిర్లైన్స్‌ విమానం బయలుదేరేందుకు సిద్దమైంది. విమానంలో సిబ్బందితో పాటు 130 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే చెకింగ్‌ అనంతరం పైలట్‌ టేకాఫ్‌ చేశాడు. అయితే టేకాఫ్‌ అయిన 15నిమిషాలకే కుడివైపు ఇంజిన్‌ లో మంటలు చెలరేగాయి. అయితే మంటలను గమనించిన పైలట్‌ వెంటనే అలర్ట్‌ అయ్యాడు. మంటలను గుర్తించి వెంటనే పైలట్‌ లాండింగ్‌ కి అనుమతి కోరాడు. ప్రయాణికులు భయపడాల్సిన అవసరం లేదని సమాచారం ఇచ్చారు. అందరూ కదలకుండా కూర్చోవాలని తెలిపాడు. మంటలను గమనించిన ప్రయాణికులు భయాదోళన చెందారు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఎవరి సీట్లల్లో వారు కూర్చొని వున్నారు. అయితే ల్యాండింగ్‌ కు అనుమతి కోసం పైలట్‌ కోరడంతో అలర్ట్‌ అయిన ఏటీసీ అధికారులు కొద్దిసేపు పాటు విమానాన్ని గాల్లో చక్కర్లు కొట్టించారు.
ప్రమాద తీవ్రతను గుర్తించి అత్యవసర లాండింగ్‌ కి అనుమతించారు. దీంతో ఏటిసి అధికారులు మలేషియా ఎయిర్లైన్స్‌ విమానాన్ని సేఫ్‌ గా లాండింగ్‌ చేయించారు. విమానం సేఫ్‌గా ల్యాండ్‌ కావడంతో సిబ్బందితో సహా 130 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. పైలట్‌ ను, ఏటిసి అధికారులను ప్రసంశించారు. మంటలను పైలట్‌ వెంటనే గుర్తించడంతోనే ప్రణాలతో బయట పడ్డామని తెలిపారు. ఇది నిజంగా పైలట్‌, ఏటీసీ అధికారులు ఇచ్చిన మరో జన్మగా ప్రయాణికులు తెలిపారు. విమానంలో ఎందుకు మంటలను చెలరేగాయో అధికారులు ఆరాతీస్తున్నారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

➡️