బాపట్లలో స్టూడియో నిర్మిస్తా : సినీ నిర్మాత కోన వెంకట్‌

తన సొంత ప్రాంతమైన బాపట్లలో సినిమా స్టూడియో నిర్మిస్తానని ప్రముఖ సినీ నిర్మాత కోన వెంకట్‌ చెప్పారు. గురువారం నాడు ఆయన బాపట్లలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాము ఏర్పాటు చేయబోయే స్టూడియో ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. విశాఖపట్టణంలో స్టూడియో ఏర్పాటుచేయాలని అక్కడి ఎంపీ అడిగారని, తాను పుట్టిన ప్రాంతమైన బాపట్లలోనే స్టూడియో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. గత 25 ఏళ్లుగా తమ కుటుంబాన్ని ఆదరించిన నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవాలనేది తన కోరికని చెప్పారు. బాపట్ల ప్రజలకు ఎంత మేలు చేసినా చాలా తక్కువే అవుతుందని వివరించారు.

➡️