విశాఖలో గవర్నర్ అబ్దుల్ నజీర్ కు ఘన స్వాగతం

Dec 10,2023 14:36 #visakhapatnam

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ కు విశాఖపట్నంలో ఘన స్వాగతం లభించింది. విశాఖపట్నంలో జరిగే నేవీ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు ఆదివారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో విశాఖపట్నం చేరుకున్న రాష్ట్ర గవర్నర్ కు తూర్పు నావికాదళ అధికారి వైస్ అడ్మిరల్ రాజేష్ పెండార్కర్ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం నగర మేయరు గొలగాని హరి వెంకట కుమారి, జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున, డీసీపీ ఆనంద్ రెడ్డి, రెవెన్యూ డివిజనల్ అధికారి హుస్సేన్ బెఅచ్లో సాహెబ్ తదితరులు పుష్పగుచ్చాలు అందజేశారు.

➡️