వృద్ధురాలిపై యువకుడు అత్యాచారం

Dec 30,2023 12:02 #old woman, #prakasam, #raped, #young man

మార్కాపురం (ప్రకాశం) : వృద్ధురాలిపై యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగింది. ఒంటరిగా నివాసముంటున్న వృద్ధురాలి ఇంట్లోకి కమలనాథ్‌ అనే యువకుడు మద్యం మత్తులో చొరపడ్డాడు. వెంటనే వృద్ధురాలు కేకలు వేయడంతో.. నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడి అక్కడినుండి పరారయ్యాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు వృద్ధురాలు చెప్పడంతో.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఆరోగ్యం మెరుగ్గా లేకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️