సూరి హత్య కేసు నిందితుడికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు

May 2,2024 17:01 #judgement, #telangana highcourt

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : మద్దెలచెర్వు సూరి హత్య కేసులో భానుకిరణ్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నాంపల్లి కోర్టు గతంలో విధించిన యావజ్జీవ కారాగార శిక్షను ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. కింది కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ భానుకిరణ్‌ హైకోర్టులో చేసిన పిటిషన్‌పై హైకోర్టు గురువారం తీర్పు వెల్లడించింది. భానుకిరణ్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ.. యావజ్జీవ శిక్ష అమలుకు ఆదేశాలు జారీ చేసింది. 2011 జనవరి 4న హైదరాబాద్‌ సనత్‌నగర్‌లోని నవోదయ కాలనీలో రివాల్వర్‌తో సూరిని కాల్చి చంపగా.. 2018 డిసెంబర్‌లో భానుకిరణ్‌కు నాంపల్లి కోర్టు జీవితఖైదు విధించింది. పరిటాల రవి హత్య కేసులో నిందితుడిగా ఉన్న మద్దెలచెర్వు సూరి ప్రధాన అనుచరుడే భానుకిరణ్‌. జనవరి 4, 2011న సూరి.. భానుకిరణ్‌తో కలిసి సనత్‌గర్‌ వెళ్తుండగా.. వెనక సీట్లో ఉన్న భాను.. సూరిపైకి మూడు రౌండ్ల కాల్పులు జరిపి అక్కడ నుంచి పరారయ్యాడు.

➡️