రాష్ట్ర స్థాయి ‘ఆడుదాం ఆంధ్రా’ మొదలు

Jan 24,2024 15:15 #Anantapuram District, #Sports
adadukundam andhra state level

ప్రజాశక్తి-రాయదుర్గం : రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తలపెట్టిన ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి పోటీలు ప్రారంభమైయ్యాయి. రాష్ట్రంలో తొలిసారిగా గ్రామ, వార్డు, సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మెగా క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ‘ఆడుదాం ఆంధ్రా’ నియోజకవర్గ స్థాయి క్రీడా సంబరాన్ని అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో హైస్కూల్ గ్రౌండ్ లొ వైకాపా రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త మరియు ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి మరియు మునిసిపల్ చైర్ పర్సన్ పోరాళ్ళు శిల్ప బుధవారం ప్రారంభించారు. క్రీడాజ్యోతిని వెలిగించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అంతేకాక వారు కూడా క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆట ఆడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి గౌని ఉపేంద్ర రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ నాగరాజు, మునిసిపల్ కమిషనర్ వి దివాకర్ రెడ్డి, ఎంపీడీవో కొండయ్య, ఎం ఈ ఓ వెంకట రమేష్, మునిసిపల్ వార్డు సభ్యులు మంజునాథ, శివకుమార్, లావణ్య, శ్రీలక్ష్మి, గోవిందరాజులు, పట్టణ కన్వినర్ అరవా శివప్ప, వై.సి.పి. నాయకులు పొరాళ్ళు శివ , నిజాముద్దీన్ , బషీర్, కృష్ణముర్తి , మునిసిపల్ సిబ్బంది, పాఠశాల అధ్యాపకులు, పాఠశాల పీడీలు, క్రీడాకారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

➡️