ప్రారంభమైన ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాలు

aiks national council meeting in kurnool

ప్రజాశక్తి – కర్నూలు ప్రతినిధి : ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాలు శుక్రవారం కర్నూలులోని శంకరయ్య నగర్ లో ప్రారంభం అయ్యాయి. తొలుత ఏఐకేఎస్ అఖిల భారత అధ్యక్షులు అశోక్ దావలే పతాకావిష్కరణ చేశారు. అనంతరం నాయకులు, ప్రతినిధులు అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. అనంతరం ప్రతినిధుల సభ ప్రారంభం అయ్యింది.

aiks national council meeting in kurnool

అమరవీరులకు ఎఐకెఎస్ కౌన్సిల్ సంతాపం
అమరవీరులకు ఎఐకెఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశం సంతాపం తెలిపింది. సంతాప తీర్మానాన్ని కేరళ కిసాన్ సభ నాయకులు ఎం.విజయ కుమార్ ప్రవేశపెట్టారు. ఎఐకెఎస్ మాజీ ప్రధాన కార్యదర్శి ఎన్.శంకరయ్య, ఎఐకెఎస్ మాజీ ఉపాధ్యక్షులు మదన్ ఘోష్, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి సునీత్ చోప్రా, సిఐటియు మాజీ ఉపాధ్యక్షులు బసుదేవ్ ఆచార్య, అఖిల భారత రైల్వే ఫెడరేషన్ నాయకులు కనై బెనర్జీ, కేరళ మాజీ ఎమ్మెల్యే ఆనందన్, త్రిపుర ఎఐకెఎస్ నాయకులు మణిక్ దాస్ గుప్తా, పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి నారాయణ బిస్వాస్, ఐద్వా మాజీ ఉ పాధ్యక్షులు సరోజినీ బాలానందన్, హర్యానా ఎఐకెఎస్ నాయకులు ప్రదీప్ సింగ్, ఎఐకెఎస్ నాయకులు మృదుల్ దే, సౌతాఫ్రికా కమ్యూనిస్టు పార్టీ నాయకులు క్రిస్ మత్లకో, సహరణ ప్పూర్ రైతు సంఘం నాయకులు గులాబ్ సింగ్కు కౌన్సిల్ సమావేశం సంతాపం తెలిపింది. యుపి సిఐటియు నాయకులు కెఎస్.బట్, త్రిపుర ఎఐకెఎస్ నాయకులు శామ్యూల్ హక్, ఎఐకెఎస్ నాయకులు వివన్ సుందరం, పులిస్ బర్దన్, యుపి ఎఐకెఎస్ నాయకులు ఆదిక్ అహ్మద్, కేరళ సిపిఐ కార్యదర్శి ఖానం రాజేంద్రన్, హరిత విప్లవ పితామహుడు ఎం.ఎస్. స్వామినాధన్, జెఎన్యు ప్రొఫెసర్ అనిల్ భట్టి, జనమోర్చ చీఫ్ ఎడిటర్ శీతల్ సింగ్, పశ్చిమ బెంగాల్ ఎఐకెఎస్ మాజీ ఉపాధ్యక్షులు హరేకృష్ణ సమంద, కేరళ కర్షక సంఘం ఉపాధ్యక్షులు పికె.సుధాకరణ్, మాజీ ఎమ్మెల్యే కె.కుంజరామన్, తమిళనాడు కిసాన్ సభ నాయకులు శక్తివేల్, శంకర్. జార్ఖండ్ సిపిఎం నాయకులు సుబాష్ ముండా, బీహార్ ఎఐకెఎస్ నాయకులు ‘రాజేష్ హన్సల్కు సమావేశం సంతాపం తెలిపింది. పాలస్తీనాలో మృతి చెందిన వారికి, ప్రకృతి వైపరీత్యాల్లో మరణించిన వారికి, వివిధ ఉద్యమాలు. పోరాటాల్లో అమరులైన వారికి సమావేశం సంతాపం తెలిపింది.

aiks national council meeting in kurnool asok dhavale
కౌన్సిల్ సమావేశాలు సందర్భంగా ప్రారంభ ఉపన్యాసం చేస్తున్నా ఏఐకేఎస్ అఖిల భారత అధ్యక్షులు అశోక్ దావలే

aiks national council meeting in kurnool delegates
కౌన్సిల్ సమావేశాలకు హాజరైన ప్రతినిధులు

aiks national council meeting in kurnoola
అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పిస్తూ….

సంతాప తీర్మానాన్ని ప్రవేశపెడుతున్న విజయ్ కుమార్

సంతాప తీర్మానాన్ని ప్రవేశపెడుతున్న విజయ్ కుమార్

➡️