అమరావతి రైతులను నమ్మించి రోడ్డున పడేశారు: ప్రత్తిపాటి

Dec 26,2023 17:05 #press meet, #Tdp Leader

చిలకలూరిపేట: నమ్మక ద్రోహం చేయడం, వాడుకొని వదిలేయడం ఏపీ సీఎం జగన్‌ నైజం అని టిడిపి సీనియర్‌ నేత ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల ప్రజలను జగన్‌ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు చిలకలూరిపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రత్తిపాటి మాట్లాడారు. తన వెంట నడిచిన ఎమ్మెల్యేలనూ జగన్‌ మోసం చేశారన్నారు. అమరావతి రైతులను నమ్మించి రోడ్డున పడేశారని ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తున్న పేదలు, నిరుద్యోగులను అణచివేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

➡️