రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ, ఆశాల ఆందోళన(ఫోటోలు)

gnt anganwadi strike on 3rd day protest

ప్రజాశక్తి-యంత్రాంగం : అంగన్వాడీల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలకు దిగుతుంది. అంగన్వాడీ కేంద్రాలను తాళాల పగలగొట్టి తెరవాలని వాలంటీర్లకు ఆదేశాలు ఇచ్చింది. మరో వైపు అనేక జిల్లాలో సమ్మెలో పాల్గొనెందుకు వెళ్తున్న అంగన్ వాడీలను అరెస్టు చేసి పోలీసులు స్టేషన్లకు తరలిస్తున్నారు.

కాకినాడ రూరల్ తూరంగి 235 అంగన్వాడీ సెంటర్ ను తాళాలు పగలుకొట్టి తెరుస్తున్న సచివాలయ సిబ్బంది

బిక్కవోలు మండలం వూలపల్లి గ్రామంలో అంగన్వాడీ సెంటర్ తాళాలు బద్దలు కొడుతున్న అధికారులు

గోకవరం తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో అంగన్వాడీలు నిరవధిక సమ్మె
అంగన్వాడీల ధర్నాకు మద్దతు తెలిపి నిరసనలో పాల్గొన్న ఏపీసీసీ మీడియా చైర్మన్ N.తులసిరెడ్డి

గంగాధర నెల్లూరులో మూడవరోజు అంగన్వాడి టీచర్లు హెల్పర్లు కు మద్దతు పలికి పాల్గొన్న సీఐటీయూ నేత వాడ గంగరాజు

అంగన్వాడి కేంద్రాల తాళాలను పగలగొడుతున్న అధికారులను అడ్డుకున్న రాజవొమ్మంగి అంగన్వాడీలు… అంగన్వాడీలకు మద్దతు తెలిపిన సిఐటియు, గిరిజన సంఘం,డివైఎఫ్ఐ నాయకులు లబ్ధిదారులు.
చాగల్లుమండల లో అన్ని అంగన్వాడి కేంద్రాల్లో ఉన్నత అధికారులు ఆదేశ ప్రకారం ఆయా గ్రామ. పంచాయతీ కార్యదర్శి విఆర్ఓ గ్రామ సచివాలయం మహిళ కానిస్టేబుల్ పంచాయతీ సిబ్బందితో అంగన్వాడి కేంద్రాలు తాళాలు బద్దలు కొట్టి రికార్డులు పరిశీలించారు

ఇచ్ఛాపురం లో అంగన్వాడీ కార్యకర్తలు కళ్లకు గంతలు కట్టుకొని, మోకాలి మీద కూర్చొని నిరశన వ్యక్తం చేస్తున్న అంగన్వాడీలు

చిలకలూరిపేట లో ఎన్. ఆర్.టి.సెంటర్లో నిరవధిక సమ్మోను నిరసన తెలువుతున్న ..అంగన్వాడీ వర్కర్లు, సిఐటియు నాయకులు
టెక్కలి లో అంగన్వాడీలు మోకాళ్ళ పై నిలబడి నిరసన
చంటి బిడ్డలను తీసుకుని ఎండను సైతం లెక్క చేయకుండా సమ్మెలో పాల్గొంటున్న అంగన్వాడీలు..
అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టి సమ్మెలో మూడోరోజు మోకాళ్ళ పై వినూత్న నిరసన
ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా గుంటూరు కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా ఆశ వర్కర్లు పెద్ద సంఖ్యలో ఈ ధర్నాకు హాజరయ్యారు ఎమ్మెల్సీ కె ఎస్ లక్ష్మణరావు వివిధ సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు.

శృంగవరపుకోటలో ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో మూడవరోజు కొనసాగుతున్న అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్, మినీ వర్కర్ల సమ్మె.wg penugonda anganwadi strike on 3rd day
పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండలో కళ్ళకు గంతలు కట్టుకుని మోకాళ్లపై నిరసన తెలుపుతున్న అంగన్వాడీ ఉద్యోగులు

mylavaram anganwadi strike on 3rd day
ఎన్టీఆర్ జిల్లాలో కళ్ళకు గంతలు కట్టుకుని మైలవరం ఎండీఓ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న అంగన్వాడీ ఉద్యోగులు

అల్లూరి జిల్లా అరకు వేలి మండలంలో అంగన్వాడీ సెంటర్ తాళాలు పగలగొట్టడానికి వచ్చిన అధికారులు ఎంపీడీవోని నిలేస్తున్న అంగన్వాడీ టీచర్లు. గత్యంతరం లేక వెనదిరిగిన అధికారులు.

విశాఖ జిల్లా ఆనందపురంలో ఆందోళన

అల్లూరి జిల్లా రంపచోడవరంలో మూడవ రోజు సమ్మెలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించి, స్థానిక అంబేడ్కర్ సెంటర్ నందు మానవహారం నిర్వహించారు.

chittoor anganwadi strike on 3rd day
బంగారుపాలెం మండలంలో మూడవ రోజు అంగన్వాడీ వారి సమ్మె..

anganwadi workers protest anantapuram
ఆనందపురం తాసిల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా

asha workers protest konaseema
తమ న్యాయమైన కోరికలు పరిష్కరించాలని కోనసీమ జిల్లా అమలాపురంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట 36గంటలు నిరవధిక సమ్మె చేస్తున్న ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్

asha workers protest pdf mlc
ఆశ వర్కర్ల దీక్షా శిబిరానికి మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్సీ ఐవి

wg anganwadi strike on 3rd day devarapalli
గురువారం దేవరపల్లి తాసిల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడి కార్యకర్త నిరసన కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ కార్యకర్తల నిరసనకు మద్దతుగా గోపాలపురం టీడీపీ మాజీ శాసన సభ్యులు ముప్పిడి వెంకటేశ్వరావు, సిపిఎం, సిఐటియు, రైతు సంఘం మద్దతు తెలిపారు.

wg chagallu anganwadi strike on 3rd day
అంగన్వాడీ కార్యకర్త నిరసనకు మద్దతు
తూర్పు గోదావరి జిల్లా చాగల్లులో అంగన్వాడీ కార్యకర్తలు గురువారం తాసిల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడి కార్యకర్త నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిరసనకు సిపిఎం, సిఐటియు, రైతు సంఘం, జనసేన మద్దతు తెలిపారు.

kanigiri anganwadi strike on 3rd day
ప్రకాశం జిల్లా కనిగిరిలో మోకాళ్ళపై నిల్చని నిరసన తెలియజేస్తున్న అంగన్వాడీలు

podili anganwadi strike on 3rd day
ప్రకాశం జిల్లా పొదిలిలో మోకాళ్లపై నిలబడి నిరసన తెలియజేస్తున్న అంగన్వాడీలు

prakasam anganwadi strike on 3rd day
ప్రకాశం జిల్లాలో ర్యాలీ చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు

nandyala anganwadi strike on 3rd day
నంద్యాల జిల్లా చాగలమరి మండలం చాగలమరిలోని స్థానిక కేల్ ఆస్పత్రి ఎదురుగా అంబేద్కర్ విగ్రహం వద్ద అంగన్వాడీలు చేస్తున్న ఆందోళన కార్యక్రమము గురువారం నాటికి మూడో రోజుకు చేరుకుంది. అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులు మోకాళ్లపై నిలబడి ఆందోళన చేపట్టారు.

gnt anganwadi strike on 3rd day protest with child
పోరుబాటలో జోల పాట…
కడప జిల్లా దువ్వూరు అంగన్వాడి వర్కర్లు ధర్నాలో పాల్గొనగా అక్కడ ఒక చంటి పిల్లవాడు ఏడుస్తూ ఉండడంతో తల్లి ఉయ్యాల కట్టి జోల పాడుతూ కనిపించింది.

gnt anganwadi strike on 3rd day protest
గుంటూరులో అంగన్వాడీల సమ్మె శిబిరానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన అంగన్వాడీలు # సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు టిడిపి గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్, నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు.

eluru anganwadi strike on 3rd day cooking1

eluru anganwadi strike on 3rd day cooking1
ఏలూరు కలెక్టరేట్ వద్ద ఆశ వర్కర్ల వంట వార్పు

eluru anganwadi strike on 3rd day pdf mlc
ఏలూరు జిల్లా: అంగన్వాడీల రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా మూడోరోజు కలెక్టరేట్ వద్ద జరుగుతున్న ధర్నా శిబిరానికి వచ్చి మద్దతు తెలిపిన ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జి.

eluru anganwadi strike on 3rd day cooking1

wg anganwadi strike on 3rd day


పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం అంగన్వాడీ సమ్మెకు మద్దతుగా మాట్లాడుతున్నా ఐద్వా జిల్లా అధ్యక్షురాలు కె పద్మజ, యలమంచిలో మోకాలపై కూర్చొని నిరసన తెలుపుతున్న అంగన్వాడీ కార్యకర్తలు

anganwadi strike on 3rd day protest muddanuru
నల్ల బ్యాడ్జిలతో కళ్ళకు గంతలు
కడప జిల్లా ముద్దనూరులో అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు చేపట్టిన సమ్మె ముడవరోజుకు చేరుకుంది. స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం అంగన్వాడీ కార్యకర్తలు నల్ల బ్యాడ్జిలతో కళ్లకు గంతలు కట్టుకుని మోకాళ్ళతో నిరసన వ్యక్తం చేశారు.

vzm anganwadi strike on 3rd day protest1
మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో దద్దరిల్లిన అంగన్వాడీల నిరసన… గుమ్మ లక్ష్మీపురం నుంచి ఎల్విన్ పేట వరకు భారీ ర్యాలీ

దీక్షలకు మద్దతు ఇస్తున్న టిడిపి నాయకులు బోనాలు విజయ్ చంద్ర కొల్లి తిరుపతిరావు ఆరు వేణుగోపాల్ నాయుడు ఎస్ శ్రీనివాసరావు పి సత్యనారాయణ ఎం శంకర్రావు తదితరులు పాల్గొన్నారు
మన్యం జిల్లా సీతానగరంలో అంగన్వాడీల దీక్షలకు మద్దతు ఇస్తున్న టిడిపి నాయకులు బోనాలు విజయ్ చంద్ర కొల్లి తిరుపతిరావు, ఆరు వేణుగోపాల్ నాయుడు, ఎస్ శ్రీనివాసరావు పి సత్యనారాయణ, ఎం శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.

సీతానగరం అంగన్వాడి కేంద్రం 1 2 చిన్నబోగిలి అంగన్వాడి కేంద్రం వోలంటీర్లు మహిళా పోలీసులు అంగన్వాడి కేంద్రాల తాళాలు పగలగొట్టి పగలగొట్టారు
మన్యం జిల్లా సీతానగరం అంగన్వాడి కేంద్రం 1,2 చిన్నబోగిలి అంగన్వాడి కేంద్రం వోలంటీర్లు మహిళా పోలీసులు అంగన్వాడి కేంద్రాల తాళాలు పగలగొట్టి పగలగొట్టారు.

tpt anganwadi strike on 3rd day
తిరుపతి జిల్లా చంద్రగిరిలో సమ్మె భాగంలో ప్రజాశక్తి పేపర్ చదువుతున్న అంగన్వాడీ కార్యకర్తలు..

akp anganwadi strike on 3rd day
అనకాపల్లి జిల్లా కసింకోట నర్సింకోట్ల ఐసిడిఎస్ అంగన్వాడి హెల్పర్స్ వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టారు. కసింకోట జాతీయ రహదారి పక్కన తమ సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రదాన కార్యదర్శి జి కోటీస్వెరరావు, జిల్లా ఉపధ్యక్షుడు. గనిసెట్టి సత్యనారాయణ, జిల్లా నాయకులు డాకరపు శ్రీనివాసరావు, ఐద్వా జిల్లా నాయకురాలు. డిడి వరలక్ష్మి కసింకోట యూనియన్ మహిళ తనుజ, కృష్ణవేణి, వరలక్ష్మి, అధిక సంఖ్యలో అంగన్వాడి కార్యకర్తలు హెల్పర్లు పాల్గొన్నారు.

konaseema anganwadi strike on 3rd day protest
తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కనీస వేతనాలు అమలు చేయాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 36 గంటలు నిరవధిక దీక్ష శిబిరం గురువారం ఉదయం కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు.

gnt anganwadi strike on 3rd day protest
అంగన్వాడీల సమ్మె మూడవరోజు గుంటూరు కలెక్టరేట్ ఎదుట సమ్మె శిబిరం కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా అంగన్వాడీలు సమ్మె శిబిరంలో మోకాళ్ళపై నిల్చని నిరసన తెలిపారు.

arrest
ఆశాలను అరెస్ట్ చేసిన రొద్దం పోలీసులు
రొద్దం మండలంలో పని చేస్తు ఆశలు గురువారం పుట్టపర్తిలో జరిగే ధర్నా కార్యక్రమం కు వెళ్లకుండా వారిని ముందస్తు అరెస్ట్ చేపట్టారు.

anganwadi strike on 3rd day center arrest atp2
అనంతపురం జిల్లా మడకశిర నుండి ఆశా వర్కర్లు, అంగనవాడీ వర్కర్లను సమ్మెకు వెళ్లకుండా అడ్డుకొని పి.రొప్పాల దగ్గర పోలీసులు అరెస్ట్ చేశారు.

బాపట్ల జిల్లా అద్దంకి మండలంలో అంగన్వాడీ కార్యకర్తల సమస్యల పరిష్కారం కోసం గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమానికి వెళ్లేందుకు సిద్ధమైన అంగన్వాడీ కార్యకర్తలను స్థానిక తహసిల్దార్ కార్యాలయం నుండి పోలీసులు బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించారు.

anganwadi strike on 3rd day center open
అంగన్వాడీలు సమ్మె చేస్తున్న సందర్భంలో గురువారం ఉదయం అంగన్ వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టి తెరిచి యానిమేటర్లకు అప్పగించిన సంఘటనలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలోని హరిజన పేటలో 32వ నెంబర్ గల కేంద్రాన్ని సూపర్వైజర్ నాగ పార్వతి, మహిళా పోలీసులు తెరిచి అప్పగిస్తున్నారు.
మరో మండలం కాజులూరులో అంగన్వాడీ కేంద్రాన్ని సచివాలయ సిబ్బందితో తెరిపించారు. చిన్నారులను అంగన్వాడి కేంద్రాలకు వాలంటీర్లు తరలించగా, మహిళా శక్తి సంఘాల సభ్యులు వారికి భోజనం తయారీ చేస్తున్నారు.

anganwadi strike on 3rd day center open kajuluru
కాకినాడ జిల్లా కాజులూరు మండలం పల్లిపాలెంలో అంగన్వాడీ కేంద్రాన్ని తెరుస్తున్న సచివాలయ సిబ్బంది.

➡️