గుండెపోటుతో అంగన్వాడీ కార్యకర్త మృతి

Jan 19,2024 13:30 #Anganwadi worker, #died, #heart attack

ఆత్రేయపురం (konaseema) : సమ్మెకు వెళుతుండగా, గుండెపోటుతో అంగన్వాడీ కార్యకర్త మృతి చెందిన విషాద ఘటన కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో జరిగింది. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ … అంగన్వాడీలు గత 38 రోజులుగా నిరవధిక దీక్షలను చేపడుతూనే ఉన్నారు. అయితే ఈరోజు ఆత్రేయపురంలోని కొత్తపేట ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద కొనసాగుతోన్న సమ్మెకు వెళుతుండగా, అంగన్వాడీ కార్యకర్త శాంతకుమారి (50) గుండెపోటుతో మృతి చెందారు. ఆమెకు అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి రావడంతో అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తరలించేలోపే మార్గమధ్యంలో తుదిశ్వాస విడిచారు.

➡️