10thDay: కోస్తున్నవి తాళాలు కావు.. వారి హృదయాలు…

anganwadi workers strike 10th day

ప్రజాశక్తి-యంత్రాంగం : రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీలు వివిధ రూపాల్లో ఆందోళన కొనసాగుతుంది.  ప్రభుత్వం వెంటనే తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అంగన్‌వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం పదో రోజుకు చేరింది.

బాపట్లలో అంగన్వాడీ సమ్మె శిబిరం వద్ద అంగన్వాడీలకు సంఘీభావం తెలుపుతున్న ఎమ్మెల్సీ లక్ష్మణరావు
ప్రకాశం జిల్లాలో అంగన్వాడి వర్కర్ల దీక్షలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కొండారెడ్డి
కిర్లంపూడిలో 10వ రోజు కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె
తెనాలిలో నిర్వహిస్తున్న అంగన్వాడీ సమ్మెలో మద్దతు తెలిపిన లబ్దిదారులు
గుంటకల్ పట్టణంలో అంగన్వాడి సమ్మెకు సిపిఎం, ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపి సమ్మె శిబిరం దగ్గర మోకాళ్ళతో నిరసన తెలిపిన నాయకులు
మైలవరం యంపిడిఓ కార్యాలయంలో అంగన్వాడీల నిరసన
విజయనగనం లెక్టరేట్ ఎదుట నిరసన సమ్మెలో భాగంగా చెవిలో పువ్వులు పెట్టుకొని అంగన్వాడీల నిరసన
బాపట్ల జిల్లా కారంచేడు మండలం దగ్గుబాడు గ్రామంలో మానవహారం నిర్వహించిన అంగన్వాడీ కార్యకర్తలు.. అనంతరం వెల్ఫేర్ అసిస్టెంట్ కు వినతి పత్రం అందజేశారు.
కాకినాడలో ఇంద్ర పాలెం లాకులు సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం సర్కిల్ వద్ద మానవహారం

పీలేరు ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు మానవహారం
కాకినాడ జిలా్కల కరపలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద నిర్వయిస్తున్న సమ్మెలో సీఐటీయూ , అంగన్వాడి నాయకులు

kadapa anganwadi workers strike 10th day a

జగనన్న, మీకు కేకులు… మాకు గడ్డి..

కడప జిల్లా – మైదుకూరు : జగనన్న మీకు కేకులు మాకు గడ్డి అంటు మైదుకూరులో అంగన్వాడి కార్యకర్తలు గడ్డి తిని తమ నిరసన వ్యక్తం చేశారు. గురువారం సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా అందరూ కేకులు తింటూ ఉంటే మైదుకూరులో మాత్రం అంగన్వాడీ కార్యకర్తలు గడ్డి తిని తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

కనిగిరి పట్టణంలోని పామూరు బస్టాండ్ చర్చి సెంటర్లో సమస్యల పరిష్కారం కోసం మానవహారం చేపట్టిన అంగన్వాడీలు

kadapa anganwadi workers strike 10th day cong

అంగన్వాడీల సేవలు ప్రశంసనీయం
సమ్మెకు సంపూర్ణ మద్దతు
రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి
కడప అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఐసిడిఎస్ అర్బన్ ప్రాజెక్టు ఎదుట సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది రోజులు గా అంగన్వాడీలో సమ్మె చేస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. లక్షా పదివేల మంది మహిళలు రాష్ట్రవ్యాప్తంగా సమ్మెలో ఉన్నారని పేర్కొన్నారు. మహిళలు కన్నీరు కారుస్తే మంచిది కాదని పేర్కొన్నారు. శాంతియుతంగా సమ్మెను విరమింపజేయాలని ప్రభుత్వాన్ని సూచించారు. అంగన్వాడీ వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ మానస పుత్రిక అన్నారు. తెలంగాణలో మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చాలని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో అందరి సహకారంతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారం రోజు లోపల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సీఎం స్పందించకపోతే ఓటు అనే ఆయుధంతో అంగన్వాడీలు తమ సత్తా చూపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నగర అధ్యక్షులు విష్ణు ప్రియతమ రెడ్డి, జిల్లా అధ్యక్షులు శ్రీరాములు, ఎన్ ఎస్ యు ఐ బాబు, యూత్ కాంగ్రెస్ మధు రెడ్డి, చీకటి చార్లెస్, అలీ ఖాన్, లక్ష్మయ్య, నరసింహులు, పాలగిరి శివ, బాష, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ అర్బన్ ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి అంజలీదేవి, డివైఎఫ్ఐ నగర్ కార్యదర్శి ఓబులేసు, కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.

చెవిలో పువ్వులతో తాళాలు వాయిస్తూ అంగన్వాడీల నిరసన
ప్రజాశక్తి – పెద్దాపురం(కాకినాడ) : సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం 10 వ రోజుకు చేరుకుంది. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ సెంటర్ లో నిర్వహిస్తున్న సమ్మె శిబిరం వద్ద అంగన్వాడీలు చెవిలో పువ్వులతో తాళాలు వాయిస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అంగన్వాడి యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఇచ్చిన హామీలు తుంగలో తొక్కిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అంగన్వాడీల పై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు.వెంటనే ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె ఉధృతం చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు దాడి బేబీ,అమల, ఎస్తేరు రాణి,నాగమణి వరలక్ష్మి, ఫాతిమా,కుమారి, స్నేహ, వన కుమారి,వసంతం, లోవకుమారి, లలిత, స్నేహలత,టి యల్ పద్మావతి,సిఐటియు నాయకులు డి క్రాంతి కుమార్,ఎస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఉండ్రాజవరం తహసిల్దార్ కార్యాలయం వద్ద పసి బిడ్డలతో సమ్మెలో పాల్గొన్న కార్మికులు

పదవ రోజు బిక్షాటన తో అంగన్వాడీల సమ్మె
ప్రజాశక్తి – ఉండ్రాజవరం(తూర్పుగోదావరి): మండల కేంద్రం ఉండ్రాజవరం తహసిల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు నిర్వహిస్తున్న సమ్మె గురువారం పదవ రోజుకు చేరుకుంది. పెరవలి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ గౌరవ అధ్యక్షులు జువ్వల రాంబాబు సంఘీభావం తెలిపిన ఈ కార్యక్రమంలో కార్మికుల సమ్మె ప్రారంభించి, పదవ రోజుకు గుర్తుగా 10 ఆకారంలో ఏర్పడి, నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి, అంగన్వాడీ కార్మికుల న్యాయపరమైన సమస్యలు తక్షణమే తీర్చాలన్నారు. అనంతరం కార్మికులతో కలిసి గ్రామంలో భిక్షాటన చేశారు. భిక్షాటన చేస్తూ, పసిబిడ్డలతో సమ్మె లో పాల్గొంటున్న కార్మికులను చూసి, ప్రజలు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉండ్రాజవరం సెక్టార్ లీడర్ ఎస్ రంగనాయకమ్మ, పెరవలి ప్రాజెక్టు ప్రెసిడెంట్ కే లక్ష్మి కుమారి, ఎం జానకి, కె ఎన్ ఎస్ ప్రసన్నకుమారి, సిహెచ్ జ్యోతి, ఎమ్ వి నరసమ్మ, జి సువర్ణ లత, ఉషారాణి, పి గిరిజ, నిర్మల, కె విజయ కుమారి, కె వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

prakasam anganwadi workers strike 10th day

బాపట్ల జిల్లా కారంచేడు మండల కమిటీ ఆధ్వర్యంలో దగ్గుబాడులో ఆందోళన చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు

annamayya anganwadi workers strike 10th day

సీఎం దిగి రావాలి.. డిమాండ్లు నెరవేర్చాలి

అన్నమయ్య-రాజంపేట అర్బన్ : ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగివచ్చి అంగన్వాడీల డిమాండ్లు నెరవేర్చే వరకు ఉద్యమం ఆగదని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్ తెలియజేశారు. గురువారం సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో స్థానిక ఐసిడిఎస్ కార్యాలయం నుంచి మన్నూరులోని రూరల్ పోలీస్ స్టేషన్ వరకు అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ర్యాలీగా వెళ్లి కొత్త బస్టాండ్ వద్ద గల వై.యస్ రాజశేఖర్ రెడ్డి కూడలి వద్ద మానవహారంగా నిలబడి నిరసన తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరిని ఎండగడుతూ నినాదాలు చేశారు. ఒక నెల వేతనం పోయినా ఉద్యమం మాత్రం ఆపబోమని ఈ సందర్భంగా సిఐటియు నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు ఎంఎస్ రాయుడు, పట్టణ కార్యదర్శి సికిందర్, అంగన్వాడి కార్యకర్తలు రమాదేవి, సుజాత, ఈశ్వరమ్మ, శివరంజని, విజయ, అమరావతి తదితరులు పాల్గొన్నారు.

akp anganwadi workers strike 10th day a

అంగన్వాడీల మానవహారం
అనకాపల్లి జిల్లా – నక్కపల్లి  :  తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మెలో భాగంగా గురువారం అంగన్వాడీలు మానవహారం ప్రదర్శించారు. కనీస వేతనం 26,000 చెల్లించాలని ,గ్రాట్యూటీ ,పెన్షన్ అమలు,తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు .ప్రభుత్వం దిగి వచ్చి సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో  ఏపీ అంగన్వాడి యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎం.దుర్గారాణి, యూనియన్ నాయకులు బి.సుబ్బలక్ష్మి, రమణమ్మ ,సీత, నూకరత్నం,సత్య వేణి , కవిత, లక్ష్మి రాజ్యం, ఉమ్మడి లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు .

 

nlr anganwadi workers strike 10th day s

 

అంగన్ వాడీ సమ్మె 10వ రోజు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నెల్లూరుపాళెం సెంటర్ లో అంగన్ వాడీల మానవహారం

akp anganwadi workers strike 10th day

కసింకోటలో అంగన్వాడి కార్యకర్తలు పదో రోజు నిరసన
అనకాపల్లి జిల్లా -కసింకోట:  కసింకోటలో ఐసిడిఎస్ ప్రాజెక్టు అంగన్వాడి వర్కర్స్ హెల్పెర్స్  యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో కార్యకర్తలు అంగన్వాడి కార్యకర్తలు గురువారం నిరసన నిర్వహించారు  26  వేలు జీతం ఇవ్వాలని , యాప్  తొలగించాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా నాయకురాలు డిడి వరలక్ష్మి,  అంగన్వాడి యూనియన్ నాయకులు తనుజ,  కృష్ణవేణి, కాసలమ్మ,  ఉమనారాయణమ్మ , వరలక్ష్మి , స్యేమాల పార్యితి , జ్యోతి , ఆదిలక్ష్మి అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు

atp anganwadi workers strike 10th day lepakshi

లేపాక్షిలో పిల్లలతో అంగన్వాడీలు..

మన్యం జిల్లా వైయస్ జగన్ జన్మదిన సందర్భంగా గడ్డి తింటూ నిరసన తెలియజేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు మడకశిర వైసిడియస్ ప్రాజెక్ట్ ముందు

మన్యం జిల్లా తాసిల్దార్ కార్యాలయం దగ్గర అంగన్వాడి టీచర్, వర్కర్లు ఆయాలు హెల్పర్లు మానవహారం చేపట్టారు చేసారు.

manyam anganwadi workers strike 10th day

మన్యం జిల్లా సీతంపేట ఐటిడిఏ ముఖ ద్వారం వద్ద అంగన్వాడీల సమ్మె గురువారానికి 10వ రోజుకు చేరుకుంది. మానవహారం చేపట్టారు. సిఐటియు జిల్లా కార్యదర్శి దావాలా రమణారావు సంఘీభావం తెలిపారు. ఆ సంఘం అధ్యక్ష కార్యదర్శులు పార్వతి దర్శిని, సహాయ అధ్యక్షులు అంజలి తదితరులు పాల్గొన్నారు.

manyam anganwadi workers strike 10th day

మన్యం జిల్లాలో అంగన్వాడీ సమ్మెకు మద్దతు తెలిపిన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు

atp anganwadi workers strike 10th day a

అనంతపురం జిల్లా పదవరోజు సమ్మె సందర్భంగా మండల కేంద్రంలో కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీలు…

atp anganwadi workers strike 10th day

అంగనవాడీ సమ్మె పదవ రోజు సందర్భంగా పది ఆకారంలో అనంతపురం జిల్లా మడకశిరలోని ఐసిడిఎస్ ప్రాజెక్టు ముందు నిరసన తెలియజేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు..

kadapa anganwadi workers strike 10th day

కడప జిల్లా : అంగన్వాడిలు తమ సమస్యలను పరిష్కారించాలని విన్నూతంగా వేంపల్లెలోని పాపాఘ్ని నదిలోకి అంగన్వాడీలు అందరూ వెళ్లి నీటిలో కూర్చిన్ని నిరసన వ్యక్తం చేశారు.

ఏలూరు జిల్లా అశోక్ నగర్ రాజీవ్ గాంధీ పార్కు వద్ద ఉన్న పదవ నెంబర్ అంగన్వాడి కేంద్రం తాళాలు పగలగొట్టి  సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ ప్రాజెక్టు సూపర్వైజర్ లోపలికి ప్రవేశించారు.

➡️