23rdDay: దద్దరిల్లిన కలెక్టరేట్లు

anganwadi workers strike 23day arrests
  • అనేక చోట్ల సిఐటియు నేతలను గృహనిర్బంధం చేసిన పోలీసులు
  • మరి కొంతమందిని పోలీస్ స్టేషన్ కి తరలింపు
  • అంగన్వాడీలకు సైతం నోటీసులు జారీ
  • ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అంగన్వాడీలు
  • ఖండించిన సిఐటియు, సీపీఎం

ప్రజాశక్తి-యంత్రాంగం :  అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు తమ సమస్యలను పరిష్కరించాలని శాంతియుతంగా గత 23 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. దానిలో భాగంగా తమ బాధలు చెప్పుకునేందుకు ఈరోజు తెల్లవారు జామున 4 గంటలకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కు వెళ్తున్న  అంగన్వాడీలను తిరువూరు నుండి విజయవాడ మార్గమధ్యలో చీమలపాడులో అరెస్ట్ చేసి 35 మందిని గంపలగూడెం స్టేషన్ కి, ఏ. కొండూరు స్టేషన్ కు 27 మందిని, కంచికచర్ల పోలీస్ స్టేషన్ కు 18 మందిని తరలించడాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ఖండించారు. తక్షణమే అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిం చాలని, లేనిపక్షంలో జరిగే పోరాటాల ఉదృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన హెచ్చరించారు. పోలీస్ స్టేషన్ల లో అక్రమంగా నిర్బంధించిన అంగన్వాడీలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

అంగన్‌వాడీలను పరామర్శించిన పి.మధు
రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న అంగన్వాడీ కార్యకర్తలు సిఐటియు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావు
కాకినాడ కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల బైఠాయింపు
కాకినాడ కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల బైఠాయింపు
జనవరి ఐదో తారీకు విధుల్లో చేరని పక్షంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలపై శాఖ పర్యమైన చర్యలు తీసుకుంటామని బాపట్ల జిల్లా కలెక్టర్ ఇచ్చిన మెమో ను కలెక్టరేట్ ముందు తగలబెట్టిన అంగన్వాడీలు
విజయనగరం కలెక్టరేట్ ఎదుట రోడ్డు పై బోజనాలు చేస్తూ ముట్టడి కొనసాగిస్తున్న అంగన్వాడీ లు
మచిలీపట్నం కలెక్టరేట్ కు బస్సులో తరలివెళ్తున్న అంగన్వాడీలను పోలీసులు ఘంటసాల మండల పరిధిలో అదుపులోకి తీసకున్నారు. ఈ క్రమంలో అవనిగడ్డ 9వ వార్డుకు చెందిన అంగన్వాడీ వర్కర్ బి.భవాని కళ్ళు తిరిగి పడిపోయింది. పోలీసులు హుటాహుటిన 108 వాహనానికి సమాచారం అందించి చల్లపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
గుంటూరు కలెక్టరేట్ ఎదుట అంగన్వాడిలా ఆందోళనలో స్పృహతప్పి పడిపోయిన అంగన్వాడి బాజీబి
నిరవధిక సమ్మెలో భాగంగా గుంటూరు కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల బైఠాయింపు
నిరవధిక సమ్మెలో భాగంగా గుంటూరు కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల బైఠాయింపు
గుంటూరులో అంగన్వాడీలను అడ్డుకుంటున్నపోలీసులు
నెల్లూరు కలెక్టరేట్‌ను ముట్టడించిన అంగన్వాడీలు..

విజయవాడలో కలెక్టరేట్ ను ముట్టడించిన అంగన్వాడీలు..

anganwadi workers strike 23day arrests chittoor a

చిత్తూరు కలెక్టరేట్ అంగన్వాడీ ధర్నా

anganwadi workers strike 23day arrests visakha

  • విశాఖలో 500 మంది అంగన్వాడీ కార్మికులు అరెస్ట్

విశాఖ-కలెక్టరేట్ : తమ సమస్యల పరిష్కారం కోసం 23 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్మికులు బుధవారం సమ్మెలో భాగంగా విశాఖ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి ర్యాలీగా బయలుదేరి వెళుతుండగా, ర్యాలీ ప్రారంభంలోనే పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు రోప్ పార్టీతో అడ్డంకులు కలిగించారు. అయినప్పటికీ అంగన్వాడీ కార్మికులు వెనక్కి తగ్గకుండా పోలీసులను నెట్టుకుంటూ జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి కలెక్టరేట్ కు వెళ్లేందుకు పరుగులు తీశారు. తప్పనిసరి పరిస్థితిలో పోలీసులు కూడా వారితో పరుగులు తీసి జైలు రోడ్డు జంక్షన్ వద్ద అడ్డుకొని అక్కడ సిద్ధంగా ఉంచిన వాహనాలలో అంగన్వాడీ కార్మికులను అరెస్టు చేసి పోలీస్ బ్యారెక్స్ లోని కళ్యాణ మండపానికి తరలించారు. అర్బన్ ప్రాజెక్టు చెందిన 500 మంది అంగన్వాడీ కార్మికులు అరెస్టు అయ్యారు. అరెస్టు అయిన వారిలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్షురాలు వి.తులసి, గౌరవ అధ్యక్షురాలు పి.మణి, వెంకటలక్ష్మి, శోభారాణి, పాప వేణి, శ్యామల,రామలక్ష్మి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షురాలు పి.శ్యామలాదేవి, ఐఎఫ్ టియు జిల్లా కార్యదర్శి పి.లక్ష్మిలతో పాటు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ కె ఎస్ వి కుమార్, జగదాంబ జోన్ కార్యదర్శి ఎం సుబ్బారావు, అక్కయ్యపాలెం జోన్ కార్యదర్శి జి అప్పలరాజు తదితరులు ఉన్నారు.

అనకాపల్లి జిల్లాలో అంగన్వాడీల ర్యాలీ… స్థానిక నెహ్రు సెంటర్ లో ధర్నా

 

anganwadi workers strike 23day arrests krishna

కృష్ణా జిల్లా కలక్టరేట్ వద్ద అంగన్ వాడీల  బైటాయింపు

 

anganwadi workers strike 23day arrests konaseema iv

డా.బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్న అంగన్వాడీలకు మద్దతు తెలిపిన ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు

 

విజయవాడలో        

విజయవాడలో అంగన్వాడీలు, సిఐటియు, సిపిఎం, ప్రజా సంఘాల నేతల అక్రమ అరెస్టులు..

బాపట్లలో ధర్నాకు జిల్లా స్థాయిలో భారీగా హాజరైన అంగన్వాడీలు

 

ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద మహాధర్నాలో అంగన్వాడీలు… కలెక్టరేట్ వద్ద ఇనుపకంచెలు వేసి భారీగా మోహరించిన పోలీసులు.

విజయనగరం జిల్లా కలెక్టరేట్ ముట్టడికి తరలి వచ్చిన వేలాదిమంది అంగన్వాడిలు
ఉదృతంగా సాగుతున్న ముట్టడి…
సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్

కలెక్టరేట్ దగ్గర నిర్వహిస్తున్న ధర్నాలో మాట్లాడుతున్న సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్. నర్సింగరావు. హామీలు అమలు చేసినందుకు పోరాటం విరమించేది లేదని స్పష్టం చేశారు

కలెక్టరేట్ దగ్గర నిర్వహిస్తున్న ధర్నాలో మాట్లాడుతున్న సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్. నర్సింగరావు. హామీలు అమలు చేసినందుకు పోరాటం విరమించేది లేదని స్పష్టం చేశారు

తిరుపతిలో అంగన్వాడీలు కలెక్టరేట్ ముట్టడి దృశ్యాలు

తిరుపతిలో అంగన్వాడీలు కలెక్టరేట్ ముట్టడి దృశ్యాలు

  • కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్న అంగన్వాడీలు

తమ సమస్యలు పరిష్కరించాలని గత 23 రోజులుగా అంగన్వాడీలు ధర్నా నిర్వహిస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని అంగన్వాడీలు బుధవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నారు.

విజయనగరం జిల్లా కలెక్టరేట్ ముట్టడికి వేలాదిగా తరలి వచ్చిన అంగన్వాడీలు
విజయనగరం జిల్లా కలెక్టరేట్ ముట్టడికి వేలాదిగా తరలి వచ్చిన అంగన్వాడీలు
విజయనగరం జిల్లా కలెక్టరేట్ ముట్టడికి వేలాదిగా తరలి వచ్చిన అంగన్వాడీలు

 

తూర్పు గోదావరి జిల్లాలో …

ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద కలెక్టరేట్ ముట్టడిలో పాల్గొన్న అంగన్వాడీలు

 

శ్రీకాకుళం జిల్లా అంగన్ వాడి వర్కర్స్ సమ్మె లో భాగంగా కలెక్టరేట్ వద్ద భైఠాయింపు కార్యక్రమం నిర్వహిస్తున్న వర్కర్స్. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, సహాయకులు

 

anganwadi workers strike 23day arrests wg s

భీమవరం నిరసన ప్రదర్శనకు వస్తున్న అంగన్వాడీలను ఎక్కడికి అక్కడే పోలీసులు అరెస్టులు చేస్తే వివిధ ప్రాంతాలకు తరలించారు

కలెక్టరేట్ ఎదుట ధర్నాకు‌ పెద్ద ఎత్తున హాజరైన అంగన్వాడీలు

కడప జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నాకు‌ పెద్ద ఎత్తున హాజరైన అంగన్వాడీలు

 

 

anganwadi workers strike 23day arrests vja d

డిమాండ్ల సాధనలో భాగంగా విజయవాడలో కలెక్టరేట్ ను ముట్టడించిన అంగన్వాడీలు.. పోలీసుల అక్రమ అరెస్టులు.. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు సహా పలువురు అరెస్ట్

 

నరసరావుపేటలో మున్సిపల్ కార్మికుల సమ్మె శిబిరాన్ని ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు

  • ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ఆదేశాల మేరకే తన అనుచరులే శిబిరాన్ని ధ్వంసం చేశారని కార్మికుల ఆరోపణ….
  • సమ్మె విచ్ఛిన్న విధానాలు మానుకోవాలని కార్మికుల హెచ్చరిక….
    యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు షేక్ సిలార్ మసూద్..

పల్నాడు జిల్లా : సమాన పనికి సమాన వేతనం ప్రాతిపదికగా న్యాయం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో అట్టహాసంగా ప్రచారం చేసుకున్న ప్రభుత్వం మంగళవారం జరిగిన చర్చలలో మాట మార్చింది. సమాన పనికి సమాన వేతనం, రెగ్యులర్, ఇతర సమస్యలు పరిష్కారం చేసేది లేదని తేల్చి చెప్పింది. మంగళవారం ప్రభుత్వ పెద్దలతో జరిగిన చర్చలు విఫలం అవడంతో బుధవారం నుండి ఏఐటియుసి కార్మికులు కూడా సమ్మెకు దిగనున్న నేపథ్యంలో సమ్మెను విచ్చిన్న చేసే దిశగా కుట్రలు జరుగుతున్నాయని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు షేక్ మసూద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కారం కోసం ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్, ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సిఐటియు) ఆధ్వర్యంలో కార్మికులు చేపట్టిన నిర్మానాత్మక సమ్మె ఉదృతంగా మారుతున్న నేపథ్యంలో సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం తెల్లవారుజామున సమ్మె శిబిరాన్ని ధ్వంసం చేశారు. టెంట్ ను పూర్తిగా చించి వేసి డిమాండ్ల ఫ్లెక్సీలను తొలగించారన్నారు.మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె ఉదృతం అవుతున్న నేపథ్యంలో సమ్మె శిబిరాన్ని అధికార పార్టీ నాయకులే ధ్వంసం చేశారని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తన అనుచరులతో సమ్మె విచ్చిన్న కుట్రలో పాల్పడుతున్నారని కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు ఆరోపించారు. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో సమ్మె జరుగుతుందని ఎక్కడ ఇటువంటి పరిస్థితి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇదిలా సమ్మెకు ఎటువంటి గౌరవం ప్రాధాన్యత ఇవ్వకుండా ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ పోటీ కార్మికులను రంగంలోకి దించి పారిశుద్ధ్య పనులు నిర్వహించడం దుర్మార్గమన్నారు. పోటీ కార్మికులతో పని చేయించడం పై ఉన్న శ్రద్ధ కార్మికుల సమస్యల పరిష్కారం పై దృష్టి పెడితే బాగుంటుందని హితవు పలికారు. రానున్న ఎన్నికల్లో కార్మికుల సమస్యల పట్ల స్పష్టమైన హామీలు ఇచ్చిన రాజకీయ పార్టీలకే ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సిఐటియు మద్దతు ఉంటుందన్నారు.

anganwadi workers strike 23day arrests vsp police

anganwadi workers strike 23day arrests vsp

విశాఖలో జీవీఎంసీ గాంధీ బొమ్మ దగ్గర అంగన్వాడి కార్యకర్తలు ధర్నా సిపిఎం కార్పొరేటర్ బి గంగారం మాట్లాడుతున్నారు. సిఐటియు లీడర్స్ పి మనీ ఆర్ కే ఎస్ వి కుమార్, ఎం సుబ్బారావు పాల్గొన్నారు.

 

ఏలూరు జిల్లా తడికలపూడిలో అంగన్వాడీలను అడ్డుకున్న పోలీసులు

 

anganwadi workers strike 23day arrests eluru

ఏలూరు జ్యూట్ మిల్ సెంటర్లో కలెక్టరేట్ ముట్టడికి సిద్ధం అయిన ర్యాలీ…. పాల్గొన్న వందలాది అంగన్వాడీ వర్కర్లు

 

anganwadi workers strike 23day arrests annamayya

అన్నమయ్య జిల్లా కలెక్టరు కార్యాలయం ముట్టడి కార్యక్రమానికి వెళుతున్న అంగన్వాడీ కార్యకర్తలలను అరెస్ట్ చేసి మదనపల్లి రూరల్ పోలీసు స్టేషన్ కు తరలించిన పోలీసులు.

anganwadi workers strike 23day arrests bapatla

బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద రోడ్డుపై బైఠాయించిన అంగన్వాడీ కార్యకర్తలు.

 

విజయవాడ : వేలాది మంది అంగన్వాడీ వర్కర్లను, ఆయాలను అరెస్టు చేసి నిర్బంధించడాన్ని సీపీఎం రాష్ట్ర కమిటీ ఖండించచింది. ఈ మేరకు రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఓ వీడియోని విడుదల చేశారు. అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయమని అడిగితే అరెస్టులు చేయడం గర్హనీయమందని తెలిపారు. 5వ తేదీ లోగా డ్యూటీ లోగా చేరకపోతే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం దుర్మార్గంమన్నారు.
వారి న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కడప కలెక్టరేట్ చేరుకుంటున్న అంగన్వాడీలు

 

anganwadi workers strike 23day arrests araku

అల్లూరి జిల్లా – హుకుంపేట మండలంలోని గిరిజన సంఘం మండల కార్యదర్శి వైస్ ఎంపీపీ సుడిపల్లి కొండలరావు గృహనిర్బంధం చేశారు. అనంతరం వైస్ ఎంపీపీను పోలీస్ స్టేషన్ కు తరలించి నిర్బంధించడం జరిగింది.

 

anganwadi workers strike 23day arrests wg

 

anganwadi workers strike 23day arrests wg tanuku

ప. గో. జిల్లా – తణుకు రూరల్ : అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ పిలుపు లో భాగంగా బుధవారం కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో ముందస్తు అక్రమ అరెస్టులను జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పీవీ. ప్రతాప్ తీవ్రంగా ఖండిచారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు ప్రతాప్ ఇంటికి నాలుగురు పోలీసులు వచ్చి పోలిస్ స్టేషన్ కి తీసుకువెళ్ళారు.

anganwadi workers strike 23day arrests wg a

పశ్చిమ గోదావరి జిల్లా – భీమవరం : 

అంగన్వాడీల సమ్మెపై మరోసారి పోలీసులు నిర్బంధాన్ని విధించారు. జిల్లావ్యాప్తంగా సిఐటియు నేతలను గృహనిర్బంధం చేశారు. మరి కొంతమందిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అంగన్వాడీలకు సైతం పోలీసులు ముందస్తు నోటీసులు జారీ చేశారు. సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం డౌష్టికాన్ని ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో గత 22 రోజుల నుంచి అంగన్వాడీలు శాంతియుతంగా సమ్మె చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా అధికార బలాన్ని ఉపయోగించి అంగన్వాడీలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా సమ్మెను నీరుగార్చాలని లక్ష్యంతో ముందుకు సాగుతుంది. అయితే అంగన్వాడీలు సైతం ఇవేమీ లెక్కచేయకుండా కఠోర దీక్షతో ఉద్యోగులను సైతం పణంగా పెట్టి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముక్కువనేని దీక్షతో సమ్మెను కొనసాగిస్తున్నారు. దీంట్లో భాగంగా భీమవరంలో అంగన్వాడీల నిరసన ప్రదర్శన నిరసన సభకు సిఐటియు జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో దీనిని అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసులు ఉపయోగించి సమ్మెపై నిర్బంధాన్ని విధించింది. అంగన్వాడీలకు ముందస్తు నోటీసులు జారీ చేసి నిరసనకు వెళ్లేందుకు వీలులేదని వెళ్తే ఊరుకోమని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే జిల్లా వ్యాప్తంగా సిఐటియు నేతలను తెల్లవారుజాము నుంచే గృహ నిర్బంధం చేశారు. మరి కొంతమందిని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఏటియు జిల్లా అధ్యక్షులు జెయన్ వి గోపాలన్ , జిల్లా నాయకులు డి.కళ్యాణి,కర్రి నాగేశ్వరరావు,పివిప్రతాప్ ,బి.వాసుదేవరావు, జవ్వాది శ్రీనివాస్ ను గృహ నిర్బంధం చేసి అరెస్టు చేశారు. జెఎన్వి గోపాలనను ఇంటిదగ్గర అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ నేపథ్యంలో అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించకుండా న్యాయపోరాటం చేస్తున్న తమపై అక్రమ నిర్బంధాన్ని విధించడం ఎంతవరకు సమంజసం అని ఇది సరైనది కాదని అంగన్వాడీలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో భీమవరం నిరసన ప్రదర్శనకు అంగన్వాడీలు వేలాదిగా తరలివచ్చేందుకు సిద్ధమయ్యారు.

  • సిపిఎం జిల్లా కమిటీ ఖండన

అంగన్ వాడీల ఆందోళనకు మధ్థతుగ నిలిచిన సిఐటియు,సిపియం జిల్లానాయకులను అరెస్టు చేయడం,గృహనిర్భందం చేయడాన్ని సిపియం జిల్లా కమిటీ తీవ్రంగ ఖండించింది. ఈ మేరకు సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం బుధవారం ఒక ప్రకటన చేశారు. నాయకులు జెయన్ విగోపాలన్ ,డి.కళ్యాణి,కర్రి నాగేశ్వరరావు,పివిప్రతాప్ ,బి.వాసుదేవరావు, జవారి శ్రీనివాస్ , జిల్లా వ్యాపితంగ నాయకులను అరెస్టు చేయడం అక్రమం,అన్యాయమని పేర్కొన్నారు.అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం మొండివైఖరి విడనాడి ఇచ్చిన హామీమేరకు అంగన్ వాడీల డిమాండ్లు పరిష్కరించి న్యాయం చేయాలని బలరాం డిమాండ్ చేశారు.అంగన్ వాడీలకు అందరు అండగ నిలవాలని విఙ్ఞప్తి చేశార.

 

anganwadi workers strike 23day arrests

ఎన్టీఆర్ జిల్లాలో అరెస్టు చేసి, పోలీసు స్టేషన్ లో ఉన్న అంగన్వాడీలు…

➡️