28thDay: తాటాకు చప్పుళ్ళకు భయపడేది లేదు

anganwadi workers strike 28th day

ప్రజాశక్తి-యంత్రాంగం : ఎస్మాను ప్రయోగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జిఒ నంబర్‌-2ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రంలో అంగన్‌వాడీలు నిరసనలు కొనసాగిస్తున్నారు. అంగన్వాడీలు వారి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని  అంగన్వాడీలు చేస్తున్న సమ్మె సోమవారం నాటికి 28వ రోజుకు చేరుకుంది. ఆదివారం పలు జిల్లాలోని  దీక్షా శిబిరాల వద్ద ఎస్మా జిఒ ప్రతులను దగ్ధం చేశారు. హామీలు నెరవేర్చే వరకు అంగన్వాడీల ఉద్యమం కొనసాగుతుందని అంగన్వాడీలు అన్నారు. ఈ సందర్భంగా పలువురు అంగన్వాడీలు మాట్లాడుతూ ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించకుండా ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన అంగన్వాడీ కేంద్రాలు తెరిచేది లేదన్నారు. ఇటువంటి తాటాకు చప్పుళ్ళకు భయపడేది లేదన్నారు. వెంటనే వేతనాలు పెంచుకున్నట్లు మరో జీవో ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు.

 

anganwadi workers strike 28th day alluri

  • భయపడే ఎస్మా ప్రయోగం 

అల్లూరి జిల్లా – రాజవొమ్మంగి : తమ సమస్యల పరిష్కారానికై చట్టబద్ధంగా అంగన్వాడీల పోరాటానికి భయపడే ప్రభుత్వం వారిపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించి జీఓ2 తీసుకొచ్చిందని సిపిఎం రంపచోడవరం జిల్లా కార్యదర్శి బి కిరణ్ అన్నారు, తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడి వర్కర్లు అండ్ హెల్పర్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీలు చేపట్టిన సమ్మె సోమవారం 28వ రోజు కొనసాగింది, సోమవారం స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహం ఎదురుగా అంగన్వాడీల సమ్మెకు సిపిఎం జిల్లా కార్యదర్శి బి కిరణ్, గిరిజనసంఘం రాష్ట్ర అధ్యక్షలు లోతా రామారావు, తదితరులు సంఘీభావం తెలిపారు,అంగన్వాడీలు నల్ల చీరలు ధరించి ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్మా చట్టం జీఓ ప్రతులను స్థానిక అంబేద్కర్ విగ్రహానికి అందజేశారు,ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినదించారు,ఈ సందర్భంగా సిపిఎం రంపచోడవరం జిల్లా కార్యదర్శి బి కిరణ్ తదితరులు మాట్లాడుతూ, ప్రభుత్వం తన భయాన్ని బయట పెట్టుకుందన్నారు, గత 28 రోజుల నుంచి సమ్మె చేస్తున్న అంగన్‌వాడీ ఆడపడుచుల పట్ల నిర్బంధాన్ని ప్రయోగించేందుకు ఎస్మా చట్టాన్ని జగన్‌ ప్రభుత్వం తీసుకువచ్చిందని,తక్షణమే ఎస్మాని ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు, చట్టబద్ధంగా నోటీసు ఇచ్చి సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలతో 5 దఫాలు నిర్వహించిన చర్చలు తూతూమంత్రంగానే సాగాయన్నారు,సమస్యకు పరిష్కారం చూపకుండా వారిపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడమంటే వారి ఉద్యమానికి జగన్‌ సర్కార్‌ భయపడుతుందని అర్థం అవుతుందన్నారు,గతంలో ఎస్మాను ప్రయోగించిన ప్రభుత్వాలు కాలగర్భంలో కలిసిపోయాయని,ఆ జాబితాలోకి వైసిపి వెళ్లబో తుందని పేర్కొన్నారు, మహిళా సాధికారత గురించి ప్రగల్బాలు పలుకుతున్న జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అంగన్‌వాడీలు మహిళలు అనే విషయాన్ని మరచిపోయి వారి ఉద్యమాన్ని అణిచివేసేందుకు ఎస్మా చట్టాన్ని ప్రయోగించి తన ఖఠినత్వాన్ని చాటుకుంటుం దని దుయ్యబట్టారు, తెలంగాణాలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.18 వేలకు పెంపుదల చేసిందని,ఇది చూసైనా జగన్‌ రెడ్డి ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలన్నారు, అంగన్‌వాడీలకు మద్దతుగా ఈ నెల 9న జైల్‌ భరో కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్ర కార్మిక సంఘాలు తీర్మానించాయని, పట్టుదలతో పోరాడుతున్న అంగన్‌వాడీలకు కేంద్ర కార్మిక సంఘాలు,రాజకీయ పార్టీలు,ప్రజా సంఘాలు అండగా నిలిచినందుకు ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ మండల అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ కుమారి,కె వెంకటలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు,తమ సమస్యల పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు,ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం,సిఐటియు, డివైఎఫ్ఐ,ప్రజా సంఘాల నాయకులు,కె జగన్నాథం,కె సూరిబాబు,పి రామరాజు,టి శ్రీను,పి పాపారావు,పి సత్యనారాయణ,పి రాంబాబు,అంగన్వాడి యూనియన్ నాయకులు ఎల్ సత్యవతి,నూకరత్నం,కె లక్ష్మీ,చిన్నమ్ములు,రమణి, రమణ,రత్నం,రాజేశ్వరి, మంగ,రాధ,భవాని పెద్దసంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు.

 

anganwadi workers strike 28th day eg

తూర్పు గోదావరి జిల్లా అంగన్వాడీలను అణచివేచి, వారు చేస్తున్న నిరవధిక సమ్మెను నీరుగార్చేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 2 కాపీ ప్రతులను దగ్ధం చేస్తూ సోమవారం కడియంలో నిరసన తెలియజేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు

anganwadi workers strike 28th day sklm

శ్రీకాకుళం జిల్లా అంగన్వాడీ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని,. అంగన్వాడీ సమ్మెపై “ఎస్మా “జి.ఓ. 2.ను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించాలని సిఐటియు డిమాండ్. ఈరోజు కొత్తూరు మండల కేంద్రంలో నల్ల బెలూన్లతో నిరసన

anganwadi workers strike 28th day atp

అనంతపురం జిల్లా – సోమందపల్లి మండలంలోని అంగన్వాడి కార్యకర్తలు సోమవారం వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. స్థానిక వాల్మీకి సర్కిల్ నుండి అంబేద్కర్ సర్కిల్ మీదగా కలశాలు, జ్యోతులతో గౌరవ వేతనం మాకొద్దు కనీస వేతనం కల్పించు జగనన్న అంటూ నినాదాలు చేస్తూ స్థానిక వెంకటేశ్వర కళ్యాణ మండపంలో గల శివాలయం కు జ్యోతులు, కలశాలు, మోశారు.

anganwadi workers strike 28th day kadapa

  • ఎస్మా జీవో ప్రతులను దగ్ధం చేసిన అంగన్వాడీలు

కడప జిల్లా – వేంపల్లె :  అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఎస్మా జీవో 2 ప్రతులను అంగన్వాడీలు దగ్ధం చేశారు. అంగన్వాడీలు చేస్తున్న సమ్మె సోమవారం 27వ రోజుకు చేరుకుంది. దీంతో స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ మహిళాలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఎస్మా జీవో ప్రతులను దగ్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వంపై, సిఎం జగన్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంగన్వాడీలపై ప్రయోగించిన ఎస్మాను రద్దు చేయక పోతే వైకాపా ప్రభుత్వాన్ని అంగన్వాడీలు ఇంటికి పంపిస్తారని అంగన్వాడీ సంఘాల నాయకురాలు సరస్వతి, లలితా, సావిత్రి, శైలజా, శాంత కుమారి, శ్యామలలు పేర్కొన్నారు. ఎస్మా ప్రయోగించిన తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మెను ఆపేది లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో వేంపల్లె, చక్రాయపేట, వేముల మండలాల్లోని అంగన్వాడీల మహిళాలు పాల్గొన్నారు.

 

anganwadi workers strike 28th day vsp

  • అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగాన్ని ఉపసంహరించుకోవాలి

అనకాపల్లి జిల్లా – దేవరాపల్లి : అంగన్‌వాడీలపై ఎస్మా ప్రయోగాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని జీతాలు గ్రాడ్యుయేట్ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని సోమవారం దేవరాపల్లి తహశీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు నల్ల బెలునులతో నిర్సన తెలిపారు. ఇది పూర్తిగా అప్ర జాస్వామిక మని పేర్కొన్నారు తక్షణమే జీవో ను ఉపసంహరించు కోవాలని లేదంటే మరింతగా సమ్మె ఉద్రుతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ ఇచ్చిన హమిని వెంటనే అమలు.చేయాలని.నాలుగున్నరాలు ఓపిగ్గా ఉన్నామని ముందుగా నోటిషులు ఇచ్చి శాంతియుతంగా సమ్మేచేస్తు ఉంటే అంగన్వాడీలు సెంటర్లు తాళాలు. బద్దలు గోట్టడం సచి వాలయం ఉద్యోగులు చేత పనులు చేయించడం వంటి చర్యలకు పూనుకున్నారని తెలిపారు. అయిప్పటికీ అంగన్వాడీలను ఎమి చేయలేక. ఎస్మాచట్టాన్ని ప్రయాగించి భయపెడుతున్నారని తెలిపారు. ఇంతటి సిగ్గుమాలిన పని మరోకటి లెదన్నారు. న్యాయబద్ధమైన సమ్మెను నిరంకుశ చర్యల ద్వారా విచ్ఛిన్నం చేయాలనుకోవడం అభ్యంతరకరమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమాన్ని అణిచి వేయాలని చూస్తున్నదని ఇదే వైఖరి కొనసాగితే జరిగే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జయ, అమ్మాజి, కోమాలి, మణి, రమణమ్మ అధికసంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు‌‌.

చింతలపూడి పట్టణంలో అంగన్ వాడిలు 28వ రోజు వినుత్న నిరసన

ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణంలో అంగన్ వాడీలు 28వ రోజు నల్ల బెలున్లతో వినూత్న నిరసన

anganwadi workers strike 28th day prakasam

పామూరు : అంగన్వాడీ అండ్ హెల్పర్స్ వారి సమ్మెకు మద్దతుగా సిపిఎం, సిపిఐ, టిడిపి, జనసేన, మద్దతు తెలిపారు.

anganwadi workers strike 28th day manyam

మన్యం జిల్లాలో నిరసన తెలిపిన అంగన్వాడీ కార్యకర్తలు

anganwadi workers strike 28th day annamayya

  • వర్షం వస్తున్న గొడుగులతో అంగన్వాడీల నిరసన 

అన్నమయ్య జిల్లా  – బి.కొత్తకోట : సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం అన్నమయ్య జిల్లా,బి.కొత్తకోట పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె 28వ రోజుకు చేరుకుంది.ఇందులో భాగంగా ప్రతిరోజు ఏదో ఒక వినూత్న రీతిలో అంగన్వాడీలు తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. సోమవారం వర్షం వస్తున్న గొడుగులతో తమ నిరసనలను తెలియజేశారు.ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ తమ న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారం కోసం 28 రోజులుగా సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరించడం బాధాకరమన్నారు.ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు.

 

anganwadi workers strike 28th day chtr

జోరు వానలో చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట కొనసాగుతున్న అంగన్వాడీల దీక్షలు… సడలని సంకల్పం, వర్షాన్ని కూడా లెక్కచేయకుండా జోరు వానలో తమ సమ్మెను కొనసాగిస్తున్న శాంతిపురం అంగన్వాడీలు…

anganwadi workers strike 28th day wg

పగో యలమంచిలిలో అంగన్వాడీల మానవహారం… డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందిచారు.

anganwadi workers strike 28th day bapatla

బాపట్లలో 28వ రోజు కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె 

 

anganwadi workers strike 28th day konaseema

  • మండపేటలో 28వ రోజుకు అంగన్వాడీల సమ్మె

కోనసీమ – మండపేట : హామీలు నెరవేర్చే వరకు అంగన్వాడీల ఉద్యమం కొనసాగుతుందని అంగన్వాడి నాయకులు ఆదిలక్ష్మి, బేబీ, రాణిలు అన్నారు. అంగన్వాడీలు వారి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద అంగన్వాడిలు చేస్తున్న సమ్మె సోమవారం నాటికి 28వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పలువురు అంగన్వాడీలు మాట్లాడుతూ ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించకుండా ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన అంగన్వాడీ కేంద్రాలు తెరిచేది లేదన్నారు. ఇటువంటి తాటాకు చప్పుళ్ళకు భయపడేది లేదన్నారు. వెంటనే వేతనాలు పెంచుకున్నట్లు మరో జీవో ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడిలు నాయకులు జానకి, సూర్యకుమారి, కుమారి, కృష్ణ కుమారి తదితరులు పాల్గొన్నారు.

 

➡️