రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల రాస్తారోకో

anganwadi workers strike on 11th day a

ప్రజాశక్తి-యంత్రాంగం : అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమ్మె 11రోజుకు చేరింది. వారి డిమాండ్లను తీర్చకపోవడం ప్రభుత్వ వైఫల్యమైందని ఆగ్రహిస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే పలు జిల్లాలో ఏర్పాటు చేసిన సమ్మె శిబిరాల వద్ద వినూత్న పద్దతిలో అంగన్వాడీలు ఆందోళన ప్రదర్శనలు చేస్తున్నారు. చాలీచాలని జీతాలతో బతకడం కష్టం ఉందంటూ అంగన్‌వాడీలు చేస్తున్న విజ్ఞప్తులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తాజాగా మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషశ్రీ చరణ్‌ మాట్లాడుతూ ఉద్యోగ విరమణ చేసిన తరువాత గంజితాగడానికైనా వీలుగా గ్రాట్యుటీని ఇవ్వాలన్న కోరికను సైతం తమ పరిధిలోనిది కాదంటూ తిరస్కరించారు. జీతాలు పెంచకపోయినా సమ్మెను విరమించాలని అంగన్‌వాడీలను కోరడంపై అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

vzm anganwadi workers strike on 11th day. s

జాతీయ రహదారిపై బైఠాయించిన అంగన్వాడీలు
సమస్యలు పరిష్కారం చేయకుంటే పతనం ఖాయం
యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు
విజయనగరం టౌన్ :  అంగన్వాడి కార్యకర్తలు జాతీయ రహదారినీ దిగ్బంధం చేసి కదం తొక్కారు. గత 11 రోజులుగా కార్యకర్తలు చేపట్టిన నిరావధికే సమ్మె విశ్వరూపం దాల్చింది శుక్రవారం నాడు కలెక్టరేట్ నుంచి బొబ్బిలి వైపు వెళ్ళే జాతీయ రహదారి ఓయూ యూత్ హాస్టల్ ఎదురుగా రహదారిపై బైటాయించారు. తమ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కారం చేయాలని కోరుతూ నినాదాలు చేశారు. అర్ధ గంట పాటు చేసిన రాస్తారోకో కారణంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఇరువైపులా వందలాది వాహనాలు నిలిచిపోయాయి. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తమ పోరాటం ఆగదని అంగన్వాడీలు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బి.పైడిరాజు మాట్లాడుతూ అంగన్వాడీల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూపడం సరికాదన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించేందుకు చూపాలని డిమాండ్ చేశారు గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని తక్షణమే నెరవేర్చాలని అన్నారు.అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, గ్రాట్యూటిఅమలు చేయాలని, సమస్యలు పరిష్కారం చేయాలనిఅన్నారు. డిసెంబరు 12 నుండి చేపట్టిన నిరవధిక సమ్మె 11వ రోజు కొనసాగింది.

 

vskp anganwadi workers strike on 11th day mdpl

విశాఖలో అంగన్వాడీల సమ్మెకు మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ

విశాఖలో అంగన్వాడీల మానవహారం

gnt anganwadi workers strike on 11th day amv

అమరావతి: నేను సైతం అంటున్నా అంగన్వాడి విద్యార్థిని…….

చీడికాడలో కలెక్టర్ కారును అడ్డగించిన అంగన్వాడి కార్మికులు

రాజమహేంద్రవరం గణేష్ చౌక్ లో అంగన్వాడీల మానవహారం

రాజమహేంద్రవరం గణేష్ చౌక్ లో అంగన్వాడీల మానవహారం

దేవరపల్లి బస్టాండ్ వద్ద అంగన్వాడీల రాస్తారోకో

 

బిక్కవోలు వంతెన వద్ద రాస్తారోకో నిర్వహించి మానవహారం చేస్తున్న అంగన్వాడి టీచర్లు

అంగన్వాడీల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రామ్ గోపాల్ వర్మ ఫోటోలు దగ్ధం చేస్తున్న అంగన్వాడీలు

 

vskp anganwadi workers strike on 11th day chnr

విజయం సాధించే వరకు పోరాటం : సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింగరావు
అనకాపల్లి ప్రతినిధి : కనీస వేతనాలు, గ్రాట్యుటీ, ఇతర సమస్యలు పరిష్కరించే వరకు అంగన్ వాడీ లు ఐక్యంగా పోరాటం కొనసాగించాలని సిఐటియు రాష్ట్ర ప్రదాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు పిలుపునిచ్చారు. శుక్రవారం కశింకోటలో అంగన్ వాడీ సమ్మె శిబిరం వద్ద ఆయన మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం జాప్యం చేస్తే నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. అంగన్ వాడీలు పొందుతున్న సదుపాయలన్నీ పోరాడి సాధించుకున్నవేనని అన్నారు. న్యాయమైన సమస్యలు పరిష్కరించుకుంటూనే ఐసిడిఎస్ ను పరిరక్షించుకోవాలన్నారు. ప్రజల మద్దతుతో జరుగుతున్న ఈ పోరాటం విజయవంతం అయ్యే వరకు కొనసాగించాలని అన్నారు. పేదలకు పౌష్టికాహారం, అక్షరాస్యత పెరగడానికి దోహదపడుతున్న అంగన్ వాడీ కేంద్రాలను బలహీనపర్చాలని చూస్తున్న ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అనకాపల్లి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్ శంకర రావు, జి.కోటేశ్వరరావు, అంగన్ వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగశేషు, తనుజా, ఉమా నారాయణమ్మ, కాసులమ్మ, డిడి వరలక్ష్మి, సిఐటియు నాయకులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

kadapa anganwadi workers strike on 11th day car

  • కడప జిల్లాలో పుడ్ కమిషన్ చైర్మన్ కి చేదు అనుభవం

అంగన్వాడీలను దోషిలుగా చిత్రీకరించడం సబబు కాదు

చేతనైతే అంగన్వాడీలకు జీతం పెంచండి :  అంగన్వాడీల నిలదీత

మైదుకూరు : రాష్ట్రంలోని అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లను దోషిలుగా వీడియోలు చిత్రీకరించడం సబబు కాదని మైదుకూరు పట్టణంలో రాష్ట్ర ఫుడ్ కమిటీ చైర్మన్ చిత్తా విజయ్ కుమార్ రెడ్డిని అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు నిలదీశారు. శుక్రవారం చిత్త విజయ్ కుమార్ రెడ్డి కారును అడ్డుకున్న అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు మీరు తీస్తున్న వీడియోలలో అంగన్వాడీ కార్యకర్తలకు రూ.6వేలు కూడా ఎక్కువే అంటూ వీడియో పోస్ట్ చేయడం సబబు కాదని వెంటనే అంగన్వాడీలకు క్షమాపణ చెప్పాలంటూ నిలదీశారు. స్పందించిన చిత్తా విజయ్ కుమార్ రెడ్డి నేను తీసిన వీడియోను మీకు ఎవరో కట్ చేసి పంపారంటూ సమాధానం ఇచ్చారు. నేను అంగన్వాడి కార్యకర్తలకు అనుకూలంగా ఉంటానని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో వీలైనంత త్వరగా మాట్లాడి అంగన్వాడీ కార్యకర్తలకు, హెల్పర్లకు న్యాయం జరిగేలా చూస్తానంటూ హామీ ఇచ్చారు. దీంతో అంగన్వాడీ కార్యకర్తలు శాంతించారు. కార్యక్రమంలో సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు, సిపిఎం, సిపిఐ, ఎంఆర్పిఎస్ నేతలు పాల్గొన్నారు.

 

vskp anganwadi workers strike on 11th day

హైవే దిగ్బంధం… రాస్తా రోకో..
అంగన్వాడీలను చుట్టుముట్టిన పోలీసులు
రోప్ తో కట్టడి చేసే క్రమంలో అంగన్వాడీలకు, మహిళా పోలీసులకు మధ్య తోపులాట
బూటుతో తన్నిన మహిళా పోలీసు తీరుపై  అంగన్వాడీల ఆగ్రహం
సిఐటియు నాయకులు మూర్తి, పలువురు అంగన్వాడీల బలవంతపు అరెస్టులు
ప్రజాశక్తి-తగరపువలస : న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం స్థానిక 16వ నెంబరు జాతీయ రహదారిపై భీమిలి అర్బన్, భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాల అంగన్వాడీ వర్కర్లు, సహాయకులు పెద్ద ఎత్తున రాస్తారోకో చేసి, గంటకు పైగా దిగ్బంధం చేశారు.
హైవే వద్దకు వెళ్లొద్దని పద్మనాభం మండల సిఐ సిఐటియు నాయకులు ఆర్ ఎస్ ఎన్ మూర్తిని సర్ది చెప్పడంతో పాటు ఓ సందర్భంలో హెచ్చరించిన ప్పటికీ, శాంతియుతంగానే ఆందోళన చేస్తున్నట్లు మూర్తి బదులిచ్చారు.

  • నీడలా పోలీసులు…

స్థానిక సి ఐ టి యు కార్యాలయం వద్ద ప్రారంభమైన అంగన్వాడీల ర్యాలీని తొలుత అడ్డుకునేందుకు మహిళా పోలీసులు చేసిన ప్రయత్నాన్ని ఆది లోనే అడ్డుకున్నారు. ర్యాలీకి ముందు మహిళా పోలీసులు వలయాకారంలో ఉంటూ వేంకటేశ్వర మెట్ట, హైవే వరకు నీడలా పోలీసులు వెళ్లారు

  • తోపులాట…. అరెస్టులు….

హై వే వద్ద రాస్తారోకో చేశారు. సిఐటియు నాయకులు ఆర్ ఎస్ ఎన్ మూర్తి మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యమ నేపథ్యాన్ని, సిఎంకు తెలియకుంటే, గతంలో సిఎంగా పని చేసిన చంద్రబాబు నాయుడును అడిగితే తెలుస్తుందని స్పష్టం చేశారు. మూర్తి మాట్లాడుతుండగా, పోలీసులు ఉన్న పళంగా అరెస్ట్ చేసి జీపులోకి ఎక్కించారు. పోలీసు జీపు ముందుకు కదలనీయ కుండా అంగన్వాడీలు రోడ్డుపైనే బై ఠాయించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ లకు, మహిళా పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఒకానొక దశలో ఏం జరుగుతుందో తెలియని పరిస్తితి. పరిస్థితి అదుపు తప్పుతుందని గ్రహించిన పోలీసులు రోప్ సాయంతో హైవే పైకి వెళ్లకుండా కట్టడి చేశారు. అయినా సరే రోప్ కిందకు వెళ్లి, చేదించుకుని మళ్ళీ హైవే ఎక్కారు. వారిని కట్టడి చేయడానికి పోలీసులు చేసిన ప్రయత్నాన్ని పలు మార్లు అంగన్వాడీ లు అడ్డుకున్నారు. ఒక సందర్భంలో తీవ్రంగా ప్రతిఘటించారు. ఓ మహిళా పోలీస్ బూటు తో తన్నడం తో అంగన్వాడీ లు ఆమె తీరు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం జేశారు. పోలీసులకు, అంగన్వాడీ లకు మధ్య పెనుగులాటలో ఎ పి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హె ల్ప ర్స్ యూనియన్ (సి ఐ టి యు) గౌరవాద్యక్షులు కె వెంకట లక్ష్మి నోటి వద్ద గాయమై, రక్త స్రావం అయింది. ఆమెతో పాటు మరికొందరిని జీపులో అరెస్ట్ చేసి భీమిలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. నార్త్ సబ్ డివిజన్ ఎ సి పి శివ శంకర రెడ్డి ఆధ్వర్యంలో పద్మనాభం సిఐ, భీమిలి ఎస్సై, ఎఎస్సై, సిబ్బంది మహిళా పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.

 

konaseema anganwadi workers strike on 11th day

రాస్తారోకో, మానవహారంతో అంగన్వాడీల నిరసన

కోనసీమ – రామచంద్రపురం : అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న నిరవధిక సమ్మె శుక్రవారం నాటికి 11 వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పట్టణంలో రాస్తారోకో నిర్వహించారు. ఆనంతరం మానవ హారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తమ న్యాయ మైన కోర్కెలు పరిష్కరించాలని,జీతాలుపెంచాలని,నినాదాలు చేశారు.ఆందోళన కార్య క్రమానికి కే వి పి ఎస్ రాష్ట్ర నాయకులు మాల్యాద్రి, సిపిఎం జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరావు, జనసేన నాయకులు చిక్కాల దొరబాబు ,తదితరులు పాల్గొని ప్రసంగించారు.వెంటనే అంగన్వాడి వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.సి ఐ టి యు జిల్లా కార్యదర్శి నూకల బలరాం,అంగన్వాడి యూనియన్ నాయకులు ఎం దుర్గా,రామచంద్రపురం,కే, గంగవరం మండలాల పరిధిలోని అంగన్వాడి వర్కర్లు కార్య క్రమం లో పాల్గొన్నారు.

kkd anganwadi workers strike on 11th day

కరపలో అంగన్వాడీల రాస్తారోకో

కరప : సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా11 వ రోజు  శుక్రవారం అంగన్వాడీల రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.  స్థానిక తహశిల్దార్ కార్యాలయం వద్ద నిర్వయిస్తున్న సమ్మె శిబిరం నుండి ర్యాలీగా బయలుదేరి రాష్ట్ర ప్రభుత్వం తీరును వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్థానిక గ్రామపంచాయతీ వరకు ర్యాలీ నిర్వహించారు . అనంతరం బజార్ సెంటర్ కు చేరుకుని రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ అంగన్వాడి ప్రాజెక్టు నాయకురాలు పి వీరవేణి మాట్లాడుతూ పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చమని , తెలంగాణలో కన్నా అదనంగా వెయ్యి రూపాయల ఇస్తామని చేసిన హామీలు నెరవేర్చమంటే సమ్మెలో ఉండగా దౌర్జన్యంగా అంగనవాడి కేంద్రాల తాళాలు పగలు కొట్టడం సమంజసం కాదన్నారు. చర్చలకు పిలిచి కనీస వేతనం అమలు చేయాలని.తెలంగాణ కంటే అదనంగా వెయ్యి రూపాయలు ఇచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మాట తప్పకుండా నిలబెట్టుకోవాలన్నారు. పలువురు అంగన్వాడి నాయకులు  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెను ఉదృతం చేస్తామని తెలిపారు.

 

కాకినాడ జిల్లా కాజులూరులో మానవహారం నిర్వహిస్తున్న అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్

kkd anganwadi workers strike on 11th day 1

కాకినాడ జిల్లా స్థానిక తహసిల్దార్ కార్యాలయ ఎదుట ఆర్ అండ్ బి రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహిస్తున్న అంగనవాడీలు. సిఐటియు అనుబంధ సహకార ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కడగల ఆదినారాయణ సంఘీభావం తెలిపారు.

కాకినాడ జిల్లా తాళ్ళరేవులో రాస్తారోకో….

అంగన్వాడీల కార్యకర్తల నిరవధిక సమ్మె తిరుపతి జిల్లా గూడూరులో శుక్రవారానికి 11వ రోజుకు చేరుకుంది. ఈరోజు నిరాహరదీక్షలుల్లో వున్న అంగన్వాడీల సమ్మె శిబిరం వద్దకు సి.ఐ.టి.యు ఆటో కార్మిక సంఘం నాయకులు 1000/-రు. అలాగే ఆశ వర్కర్లు నాయకురాలు 1500/-రు.అంగన్వాడి కార్యకర్తలు, అగన్వాడి అధ్యక్షురాలు ఏ.ఇంద్రావతికి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. అనంతరం కాంగ్రెస్ పార్టీ, జనసేన నాయకులు, తమ పూర్తి మద్దతు ప్రకటించడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వారి న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సి.ఐ.టి.యు.నాయకులు పాల్గొనడం జరిగింది.

wg anganwadi workers strike on 11th day undi a

 

wg anganwadi workers strike on 11th day undi

ఉండిలో గడ్డి తింటూ నిరసన… రాస్తారోకోలో  పాల్గొన్న అంగన్వాడీలు..

wg anganwadi workers strike on 11th day palakollu

పాలకొల్లులో అంగన్వాడీలు మానవహారం
పాలకొల్లు : పాలకొల్లు పట్టణంలో తమ ఆందోళనలో భాగంగా శుక్రవారం తహశీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు మానవహారం చేపట్టారు. గత 11 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు సమ్మెబాట పట్టి నిరసన దీక్షలు చేపట్టారు. నిరసనలో తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె ఆగదని ప్రభుత్వంను హెచ్చరించారు. ఇంకా అంగన్వాడీ నేతలు ఎం. శ్రీదేవి, బి. నాగలక్ష్మి, పి. పద్మావతి, ఎం. ఏ నసమ్మ, సిఐటియు మండల కార్యదర్శి జవ్వాది శ్రీనివాస్ పురుషోత్తం చల్లా సోమేశ్వర రావు,అంగన్వాడీలు పాల్గొన్నారు.

sklm anganwadi workers strike on 11th day encharla

శ్రీకాకుళం జిల్లా ఎచెర్ల జాతీయ రహదారిపై అంగన్వాడీ కార్యకర్తల రాస్తారోకో

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో పాత జాతీయ రహదారిపై అంగన్వాడీ కార్యకర్తలు రాస్తారోకో

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మల్లో అంగన్వాడి కార్యకర్తలు మానవహారం నిర్వహించడం జరిగింది.

sklm anganwadi workers strike on 11th day burja

కదం తొక్కిన అంగన్వాడీలు
రోడ్డుపై బైఠాయించిన కార్యకర్తలు
రంగ ప్రవేశం చేసిన పోలీసులు
శ్రీకాకుళం – బూర్జ: అంగన్వాడి కార్యకర్తలు కదం తొక్కారు గత 11 రోజులుగా కార్యకర్తలు చేపట్టిన నిరావధికే సమ్మె విశ్వరూపం దాల్చింది శుక్రవారం నాడు పాలకొండ శ్రీకాకుళం సిహెచ్ రహదారిపై బూర్జి జంక్షన్ వద్ద కార్యకర్తలు బైటాయించారు. తమ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కారం చేయాలని కోరుతూ నినాదాలు చేశారు రెండు గంటల కాలం ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది ఇరువైపులా వందలాది వాహనాలు నిలిచిపోయాయి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తమ పోరాటం ఆగదని అంగన్వాడీలు స్పష్టం చేశారు దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి అంగన్వాడీలను రోడ్డు గడ్డంగా ఉన్న వారిని మహిళా కానిస్టేబుల్ పట్టుకొని తొలగించి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు అనేపు రామకృష్ణ మాట్లాడుతూ అంగన్వాడీల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూపడం సరికాదన్నారు ప్రభుత్వం తక్షణమే స్పందించి వారి సమస్యలను పరిష్కరించేందుకు చూపాలని డిమాండ్ చేశారు గతంలో ముఖ్యమంత్రి వారికి ఇచ్చిన హామీని తక్షణమే నెరవేర్చాలని అన్నారు
అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, గ్రాట్యూటి అమలు చేయాలని, సమస్యలు పరిష్కారం చేయాలని అన్నారు డిసెంబరు 12 నుండి చేపట్టిన నిరవధిక సమ్మె 11వ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భవతులు, బాలింతలు, 6 సంవత్సరాల లోపు పిల్లలకు అంగన్వాడీలు అనేక సేవలందిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలు చెల్లించడంలేదని అన్నారు. అంగన్వాడీలకు సంక్షేమ పధకాలు అమలు చేయాలని అన్నారు. మినీ సెంటర్లన్ని తక్షణమే మెయిన్ సెంటర్లుగా మార్చాలని, మినీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేసారు. రిటైర్మెంట్ బెపిఫిట్ 5 లక్షలకు పెంచాలని, పెన్షన్ ఇవ్వాలని డిమాండ్‌ చేసారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె పోరాటం కొనసాగుతుందని అందుకు తెలుగుదేశం పార్టీ తరఫున వారికి మద్దతు తెలియజేస్తున్నామని అన్నారు. వైసిపి ప్రభుత్వం మొండి వైఖరి వీడకుంటే తగిన గుణపాఠం తప్పదని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయుకులు జ్యోతి, రాధిక తదితరులు పాల్గొన్నారు.

 

annamayya anganwadi workers strike on 11th day a

ఉరితాళ్ళతో అంగన్వాడీల నిరసన

అన్నమయ్య జిల్లా-రాజంపేట అర్బన్ : డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ అంగన్వాడీలు 11వ రోజు శుక్రవారం ఐసిడిఎస్ కార్యాలయం వద్ద ఉరితాళ్లతో వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్ మాట్లాడుతూ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ వ్యాఖ్యలపై అంగన్వాడీలు మండిపడుతున్నారని అన్నారు. మహిళ అయి ఉండి సాటి మహిళల గోడు పట్టకుండా నిర్లక్ష్యంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదని అన్నారు. అంగన్వాడీలకు వేతనం పెంపుదల, గ్రాట్యూటీ ప్రధానమని, ఆ అంశమే మంత్రి ప్రస్తావించకపోవడం ఏంటని ప్రశ్నించారు. డిమాండ్లు నెరవేర్చే వరకు ఉద్యమం ఆగదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి సికిందర్, అంగన్వాడి కార్యకర్తలు రమాదేవి, సుజాత, ఈశ్వరమ్మ, శివరంజని, విజయ, అమరావతి తదితరులు పాల్గొన్నారు.

bapatla anganwadi workers strike on 11th day a

బాపట్ల జిల్లా కారంచేడులో రాస్తారోకో చేపట్టిన అంగన్వాడి కార్యకర్తలు, పర్చూరు చీరాల మధ్య వాహనాల రాకపోకలకు అంతరాయం , రాస్తారోకోనంతరం స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా

బాపట్ల పాత బస్టాండ్ లో రాస్తారోకో చేస్తున్న అంగన్వాడీలు

అనకాపల్లి జిల్లా దేవరాపల్లి నాలుగు రోడ్లు కూడలిలో అంగన్ వాడీలు రాస్తారోకో చేశారు. లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు అందజేయాలని, అంగన్వాడీలకు కనీసం వేతనం ఇవ్వాలంటూ నినాదాలతో హోరోత్తించారు.

అనకాపల్లి జిల్లా దేవరాపల్లి నాలుగు రోడ్లు కూడలిలో అంగన్ వాడీలు రాస్తారోకో చేశారు. లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు అందజేయాలని, అంగన్వాడీలకు కనీసం వేతనం ఇవ్వాలంటూ నినాదాలతో హోరోత్తించారు.

అనకాపల్లి జిల్లా సబ్బవరంలో అంగన్వాడీ ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం తహసిల్దార్ కార్యాలయం వద్ద దీక్షా శిబిరం నుండి ఎన్టీఆర్ జంక్షన్ వరకు అంగన్ వాడీలు ర్యాలీ నిర్వహించారు. మానవహారం చేశారు.

krishna anganwadi workers strike on 11th day

మచిలీపట్నం మూడు స్థంభాల సెంటర్ లో ఉద్రిక్తత..

జాతీయ రహదారిపై బైఠాయించిన అంగన్వాడీ కార్యకర్తలు.

మహిళలు అని కూడా చూడకుండా అంగన్వాడీ కార్యకర్తల్ని రోడ్డుపై ఈడ్చిపడేసిన పోలీసులు.

మద్దతుగా వచ్చిన సి ఐ టి యు, నాయకులను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్ లకు తరలించిన పోలీసులు

gnt anganwadi workers strike on 11th day

gnt anganwadi workers strike on 11th day

అంగన్వాడీల రాస్తారోకో
గుంటూరు జిల్లా – తెనాలి : అంగన్వాడీల నిరవధిక సమ్మెలో భాగంగా శుక్రవారం వారు ఆందోళన తీవ్రతరం చేశారు. విజయవాడ తెనాలి రోడ్డులోని ఐసిడిఎస్ కార్యాలయం సమీపంలో రోడ్డు మార్జిన్ లో సమ్మె శిబిరాన్ని కొనసాగిస్తున్న అంగన్వాడీలు, అదే రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడి టీచర్లు, ఆయాలు, సిఐటియు నాయకులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో తెనాలి- విజయవాడ రోడ్డులో వాహనాల రాకపోకలు భారీగా నిలిచిపోయాయి. ప్రభుత్వం వెంటనే అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

akp anganwadi workers strike on 11th day

చోడవరంలో అంగన్వాడీల రాస్తారోకో

ctr anganwadi workers strike on 11th day

చిత్తూరు జిల్లా శాంతిపురంలో రాస్తారోకో చేస్తున్న అంగన్‌వాడీలు

alluri anganwadi workers strike on 11th day a

అల్లూరి జిల్లా వి ఆర్ పురం మండలంలో రేఖపల్లి జంక్షన్ వద్ద జరుగుతున్న11వ రోజు సిఐటియు మండల సభ్యులు నాగమణి చేతుల మీదుగా పూలమాలవేసి సమ్మె ప్రారంభించారు. తదుపరి రేకపల్లి జంక్షన్ వద్ద మనోహరం నిర్వహించి సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పూణెం సత్యనారాయణ మాట్లాడుతున్న అంగన్వాడి కార్యకర్తలు 11 రోజులుగా సమ్మె చేస్తున్న ఇంతవరకు ప్రభుత్వం నిమ్మకు నేరెత్తినట్టు లేదని తాళాలు పగలగొట్టిన పగలగొట్టలేదని బొత్స సత్యనారాయణ అనటం విడ్డూరంగా ఉందని, ఫుడ్ కమిషనర్ ప్రతాప్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సభ్యులు సున్నం రంగమ్మ మండల కార్యదర్శి రాజేశ్వరి అధిక సంఖ్యలో కార్యకర్తలు ఆయాలు పాల్గొన్నారు.

విశాఖజిల్లా జీవీఎంసీ గాంధీ బొమ్మ దగ్గర సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో అంగన్వాడి కార్యకర్తలు రాస్తారోకో…

పోరుమామిళ్ల లో తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్వాడీలు

కడప జిల్లా పోరుమామిళ్ల లో తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్వాడీలు

కిర్లంపూడి లో అంగన్వాడీల రాస్తారోకో

కాకినాడ జిల్లాలో కిర్లంపూడిలో అంగన్వాడీల రాస్తారోకో

కంభంలో అంగన్వాడీల నిరవధిక సమ్మె

ప్రకాశం జిల్లా కంభంలో అంగన్వాడీల నిరవధిక సమ్మె

sklm anganwadi workers strike on 11th day

శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో రాస్తారోకో

prakasam anganwadi workers strike on 11th day

ఒంగోలులోని సాగర్ హోటల్ సెంటర్ లో రాస్తోరోకో

లేపాక్షి మండల కేంద్రం లో రాస్తోరోకో

అనంతపురం జిల్లా లేపాక్షి మండల కేంద్రంలో రాస్తోరోకో

annamayya anganwadi workers strike on 11th day

మంత్రి ఉషశ్రీ చరణ్ అంగన్వాడిలపై చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలి
అన్నమయ్య జిల్లా-బి.కొత్తకోట: అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమ్మె 11రోజుకు చేరింది. వారి డిమాండ్లను తీర్చకపోవడం ప్రభుత్వ వైఫల్యమైందని ఆగ్రహిస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే పలు జిల్లాలో ఏర్పాటు చేసిన సమ్మె శిబిరాల వద్ద వినూత్న పద్దతిలో అంగన్వాడీలు ఆందోళన ప్రదర్శనలు చేస్తున్నారు. చాలీచాలని జీతాలతో బతకడం కష్టం ఉందంటూ అంగన్‌వాడీలు చేస్తున్న విజ్ఞప్తులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గురువారం మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషశ్రీ చరణ్‌ మాట్లాడుతూ ఉద్యోగ విరమణ చేసిన తరువాత గంజితాగడానికైనా వీలుగా గ్రాట్యుటీని ఇవ్వాలన్న కోరికను సైతం తమ పరిధిలోనిది కాదంటూ తిరస్కరించారు. జీతాలు పెంచకపోయినా సమ్మెను విరమించాలని అంగన్‌వాడీలను కోరడంపై అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.శనివారం నుంచి బి.కొత్తకోట, పెద్దతిప్పసముద్రం మొలకలచెరువు మండలం అంగన్వాడి టీచర్లు వెల్ఫేర్లు బి.కొత్తకోట తహసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

kkd anganwadi workers strike on 11th day a

అంగన్వాడీలు రాస్తారోకో

కాకినాడ ప్రతినిధి : తమ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా అంగన్వాడీలు చేస్తున్న సమ్మె శుక్రవారం నాటికి 11వ రోజుకి చేరింది. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఇంద్రపాలెం లాకుల వద్ద అంగన్వాడీలు రాస్తారోకో నిర్వహించారు. సామర్లకోట- కాకినాడ మెయిన్ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, రిటైర్మెంట్ వయస్సు పెంచాలని, మెడికల్ లీవ్ సౌకర్యం కల్పించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాడ్యుటి అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్పు చేయాలని, తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలని, సర్వీస్ లో ఉండి చనిపోయిన అంగన్వాడీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, భీమా సౌకర్యం కల్పించాలనే తదితర డిమాండ్లతో కూడిన నినాదాలతో సెంటర్ హోరెత్తింది. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించేంతవరకు సమ్మె విరమించేది లేదని అంగన్వాడీలంతా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి రమణమ్మ, నాయకులు జ్యోతి, నీరజ, విజయ తదితరులు పాల్గొన్నారు. సిఐటియు జిల్లా కోశాధికారి మలకా రమణ ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు.

➡️