ఎపిలో మరో కొత్త రాజకీయ పార్టీ

  • జెడి లక్ష్మీనారాయణ నేతృత్వంలో ‘భారత్‌ నేషనల్‌ పార్టీ’ ఆవిర్భావం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. సిబిఐ మాజీ జాయింట్‌ డైరెక్టరు లక్ష్మీనారాయణ శుక్రవారం జై భారత్‌ నేషనల్‌ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇతర పార్టీల్లాగా తాము తప్పు చేయబోమన్నారు. బానిసత్వం నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తామన్నారు. అభివృద్ధితో అవసరాలు ఎలా తీర్చుకోవాలో నేర్పిస్తామని, అవినీతిని అంత మొందిస్తామని అన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు పెంపొందిస్తామని తెలిపారు.

➡️