బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డికి మరో షాక్‌

Dec 12,2023 11:19 #ex mla, #Telangana

నిజామాబాద్‌: ఆర్మూర్‌ బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌ రెడ్డికి మరో షాక్‌ తగిలింది. తమ వద్ద తీసుకున్న రూ.20 కోట్ల రుణంతో పాటు వడ్డీ రూ.25 కోట్లు మొత్తం కలిపి రూ.45 కోట్లు చెల్లించాలంటూ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఆర్మూర్‌లోని జీవన్‌ రెడ్డి ఇంటికి అధికారులు నోటీసులు అంటించారు. 2017లో మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి ఆయన సతీమణి రజిత రెడ్డి పేరు మీద స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి రూ.20కోట్లు రుణం తీసుకున్నారు. ఈలోన్‌కు సంబందించి ఇప్పటి వరకు డబ్బు చెల్లించలేదు. దీంతో, అసలు ప్లస్‌ వడ్డీ కలిసి రూ.45 కోట్ల బకాయి ఉందని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఇంటికి అధికారులు నోటీసులు అంటించారు. దీంతో ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

➡️