రూ.3 లక్షల కోట్లకు పైనే.. 

Dec 28,2023 10:31 #AP Economy, #Budget, #Economic Policies
Teachers should discuss the problems of teachers

 

బడ్జెట్‌పై భారీగా వచ్చిన ప్రతిపాదనలు

అవాక్కవుతున్న ఆర్థికశాఖ అధికారులు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ కోసం వస్తున్న ప్రతిపాదనలు ఏకంగా రూ.3 లక్షల కోట్లు దాటిపోయాయి. చివరకు ఈ మొత్తం రూ.3.50 లక్షల కోట్లకు చేరుకుంటుందని అధికారుల అరచనా. ఇప్పుడు ఈ ప్రతిపాదనలను వార్షిక లక్ష్యానికి కుదిరచడం ఎలా అన్నదే ఆర్థికశాఖ మురదున్న ప్రధాన ప్రతిబంధకంగా కనిపిస్తోంది. దాదాపు అన్ని శాఖలతో కసరత్తు భేటీలు పూర్తికావడంతో ఇక అంతర్గత కూర్పునకు ఆర్థికశాఖ ప్రయత్నాలు ప్రారంభించనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి శాఖలతో బడ్జెట్‌ కసరత్తు ప్రక్రియ దాదాపు పూర్తయిపోయింది. అనేక శాఖలు తమకు కావాల్సిన నిధులపై ప్రతిపాదనలు కూడా సమర్పించాయి. వాస్తవాలకు దూరంగా బడ్జెట్‌ ప్రతిపాదనలు వద్దంటూ ఆర్థికశాఖ పదేపదే చెప్పినా శాఖల నురచి మాత్రం ఇబ్బడిముబ్బడిగానే వచ్చాయి. కావాల్సినంత ప్రతిపాదిస్తే ఆర్థికశాఖ నుంచి కోతలు పడతాయని, అందుకే కావాల్సిన దానికన్నా ఎక్కువ నిధులు కోరుతున్నామని కొరతమంది అధికారులు చెబుతున్నారు. ఇలా అన్ని శాఖల నుంచి వచ్చిన మొత్తం శాసనసభలో పెట్టే బడ్జెట్‌ కన్నా రూ.లక్ష కోట్లు వరకు అధికంగా ఉంది. బడ్జెట్‌ ప్రతిపాదనల్లో ఎక్కువగా సంక్షేమ రంగానికి సంబంధించినవే. ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న బడ్జెట్‌ కావడంతో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేయాలని ఆర్థికశాఖ నురచి సూచనలు వెళ్లినట్లు తెలిసింది. ఎక్కువగా బిసి, సాంఘిక సంక్షేమ శాఖల నుంచి భారీ ప్రతిపాదనలు వచ్చినట్లు సమాచారం. ఇదే సమయంలో పాలన, నిర్వహణ, జీతభత్యాలకు కూడా వేలాది కోట్లకు అనేక శాఖలు ప్రతిపాదనలు సమర్పించాయి. ఇక అత్యవసర వ్యయం పేరుతో ఆర్థిక-ప్రణాళిక శాఖలు కూడా సొంతంగా పెద్ద మొత్తాన్నే కేటాయించుకునేందుకు నిర్ణయించినట్లు తెలిసింది. ఈసారి డ్జెట్‌లో పెట్టుబడి వ్యయం నామమాత్రంగానే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత ప్రతిపాదనల్లో నీటిపారుదల, రోడ్లు భవనాల శాఖ, పంచాయతీరాజ్‌ వంటి శాఖలకు గత బడ్జెట్‌ కన్నా పెద్దగా పెరుగుదల కనిపించలేదని తెలిసిరది.

➡️