AP High Court: పిన్నెల్లికి బెయిల్‌ పొడిగింపు

ప్రజాశక్తి-అమరావతి : పోలీసులు నమోదు చేసిన మూడు వేర్వేరు కేసుల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి గతంలో మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు జస్టిస్‌ న్యాపతి విజరు గురువారం ఆదేశాలు జారీ చేశారు. పిన్నెల్లిపై రెండు హత్యాయత్నం కేసులతోపాటు మరో కేసు నమోదైంది. పిన్నెల్లి తరపున సీనియర్‌ న్యాయవాది టి నిరంజన్‌రెడ్డి అభ్యర్థన మేరకు హైకోర్టు, గత మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. విచారణను ఈ నెల 20కు వాయిదా వేసింది.

➡️